కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లలో తప్పులు

ABN , First Publish Date - 2021-04-24T04:32:33+05:30 IST

కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునే వారి పేర్లు తప్పులు తడకలతో వస్తున్నాయి.

కొవిడ్‌ వ్యాక్సిన్‌ సర్టిఫికెట్లలో తప్పులు

డేటా ఎంట్రీ ఆపరేటర్ల పొరపాట్లు
గందరగోళంలో బాధితులు

అనకాపల్లి అగ్రికల్చర్‌, ఏప్రిల్‌ 23:
కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకునే వారి పేర్లు తప్పులు తడకలతో వస్తున్నాయి. డేటా ఎంట్రీ ఆపరేటర్లు చేసే పొరపాట్ల వల్ల వివరాల నమోదులో తప్పులు దొర్లుతున్నాయి. సర్టిఫికెట్లు చేతికందాక తప్పులు చూసి బాధితులు గందరగోళంలో పడిపోతున్నారు. వీటివల్ల విదేశీ ప్రయాణం, హెల్త్‌ ఇన్సూరెన్స్‌ క్లెయిమ్‌లు, ఇతరత్రా అవసరాలకు సమస్యలు ఉత్పన్నమవుతాయని బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వ్యాక్సిన్‌ కేంద్రాల నిర్వాహకులు, వైద్యాధికారులకు ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ విషయమై కొవిడ్‌-19 అధికారిని ‘ఆంధ్రజ్యోతి’ ప్రశ్నించగా, ఐవీఈఆర్‌ ఆన్‌లైన్‌ సాఫ్ట్‌వేర్‌ పద్ధతిలో ఎలాంటి సవరణలకు అవకాశం లేదని చెప్పారు. త్వరలో ప్యాచ్‌పేరుతో సాఫ్ట్‌వేర్‌ వస్తుందని, దీని ద్వారా తప్పులను సవరిస్తామని వివరించారు. అలాగే డేటా ఎంట్రీ సమయంలోనే వివరాలు పరిశీలించుకోవాలని ఆయన సూచించారు.

Updated Date - 2021-04-24T04:32:33+05:30 IST