న్యూ ఇయర్‌ని బాయ్‌ఫ్రెండ్‌తో సెలబ్రేట్ చేసుకున్న ఇషాగుప్తా

Published: Sun, 02 Jan 2022 17:36:29 ISTfb-iconwhatsapp-icontwitter-icon
న్యూ ఇయర్‌ని బాయ్‌ఫ్రెండ్‌తో సెలబ్రేట్ చేసుకున్న ఇషాగుప్తా

బోల్డ్ బ్యూటీ ఇషాగుప్తా కొత్త ఏడాది వేడుకలను బాయ్‌ఫ్రెండ్‌తో జరుపుకొంది. స్పెయిన్‌కు చెందిన మాన్యుల్ కాంపోస్ గుల్లర్‌తో ఆ సంబరాలను చేసుకొంది.  ఆ సెలబ్రేషన్స్‌కు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లోని అభిమానులతో ఆమె పంచుకొంది. 


సినిమాల నుంచి విరామం లభించడంతో సమయాన్ని బాయ్‌ఫ్రెండ్‌తో ఆమె గడుపుతున్నట్టు తెలుస్తోంది.  ఆమె ఈ మధ్యనే అబుదాబీలో జరిగిన ఫార్ములా వన్ రేస్‌లో హల్ చల్ చేసింది. ఆ రేసును చూడటానికి వచ్చిన వారికి ఆమె అందాలతో కనువిందు చేసింది. ‘‘ ఇన్విజిబుల్ ఉమెన్ ’’ అనే వెబ్ సిరీస్‌లో ఇషాగుప్తా నటించబోతుంది. ఆ వెబ్ సిరీస్‌లో సునీల్ శెట్టి సరసన ఆమె కనిపించబోతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్ తెరకెక్కబోతుంది. రాజేశ్ ఎం. సెల్వ దర్శకత్వం వహించనున్నారు. ఈ వెబ్ సిరీస్ కోసం ఆమె బాక్సింగ్‌‌ను  నేర్చుకుంటోంది. రజనీశ్ రవింద్రన్ అనే కోచ్ పర్యవేక్షణలో బాక్సింగ్ శిక్షణ తీసుకుంటుంది.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...