మీవల్ల కాదు.. తప్పుకొంటారా?

ABN , First Publish Date - 2022-05-31T08:52:06+05:30 IST

‘‘ఇక మీ వల్ల కాదు. మీరు తప్పుకొంటే మేమే నడుపుకుంటాం.’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న ఈఎ్‌సఐ కార్పొరేషన్‌.. అన్నట్టుగానే నేరుగా రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఈఎ్‌సఐ

మీవల్ల కాదు..  తప్పుకొంటారా?

కార్పొరేషన్‌ చేతుల్లోకి ఏపీలోని ఈఎస్‌ఐ వైద్యం!

చికిత్సలో రాష్ట్ర సర్కార్‌ వైఫల్యాలపై ఫిర్యాదులు

రోగుల కోసం రంగంలోకి ఈఎస్‌ఐ కార్పొరేషన్‌

డిస్పెన్సరీలకు నేరుగా గ్లూకో మీటర్ల సరఫరా

కనీసం షుగర్‌ పరీక్షలైనా చేయాలని ఆదేశాలు

డయాగ్నోస్టిక్‌ సెంటర్ల సేవలపై తొలుత దృష్టి

రెండేళ్లుగా అక్కడ నిలిచిన రీ-ఏజెంట్ల సరఫరా

రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రుల్లో రోగుల గగ్గోలు


(అమరావతి, ఆంధ్రజ్యోతి)

‘‘ఇక మీ వల్ల కాదు. మీరు తప్పుకొంటే మేమే నడుపుకుంటాం.’’ అంటూ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్న ఈఎ్‌సఐ కార్పొరేషన్‌.. అన్నట్టుగానే నేరుగా రంగంలోకి దిగింది. రాష్ట్రంలో ఈఎ్‌సఐ పరిధిలో 76 డిస్పెన్సరీలు, నాలుగు ఆస్పత్రులు, మూడు డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు వాటన్నింటిపైనా కార్పొరేషన్‌ దృష్టి పెట్టింది. పలు ఆస్పత్రుల్లో రోగులకు సక్రమంగా వైద్య సేవలు అందడం లేదని, కనీసం షుగర్‌ టెస్టులు, రక్తపరీక్షలు కూడా చేయడం లేదని కనుగొంది. మరోవైపు ఐపీ రోగులు కూడా ఏపీలోని ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో వైద్య సేవల తీరుపై ఎప్పటికప్పుడు ఈఎ్‌సఐ కార్పొరేషన్‌కు ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కార్పొరేషన్‌ ఏపీపై చూపు సారించింది. ముందుగా డయాగ్నోస్టిక్‌ సెంటర్ల పనితీరును పరిశీలించింది. రాష్ట్రంలో 76 డయాగ్నోస్టిక్‌ సెంటర్లు ఉన్నాయి. ఈ సెంటర్లకు అవసరమైన గ్లూకో మీటర్లను కార్పొరేషనే కొనుగోలు చేసి సరఫరా చేసింది.. గ్లూకో మీటర్లతో పాటు టెస్టుకు అవసరమైన గ్లూకో స్ట్రిప్స్‌ కూడా అందించింది. వీటి ద్వారా రోగులకు కనీసం షుగర్‌ టెస్టులు అయినా చేయండి అని కార్పొరేషన్‌ సృష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఇది కేవలం ప్రారంభం మాత్రమే! వీటితో పాటు ఆస్పత్రుల్లో, డిస్పెన్సరీల్లో డయాగ్నోస్టిక్స్‌కు అవసరమైన పరికరాలు, ఉపకరణాలు సరఫరా చేసేందుకు కార్పొరేషన్‌ సిద్ధం అయినట్లు తెలుస్తోంది.


గతంలో ఈఎ్‌సఐ ఆస్పత్రులు, డిస్పెన్సరీలకు వెళ్లే రోగులను బయటకు వెళ్లనీయకుండా అన్ని పరీక్షలూ అక్కడే నిర్వహించి ఇంటికి పంపించేవారు. గత రెండేళ్లుగా ఈఎ్‌సఐ ఆస్పత్రులు దారుణంగా మారాయి. డిస్పెన్సరీల్లో షుగర్‌ టెస్టులు చేయడం లేదు. ఆస్పత్రుల్లో ఎక్స్‌రేలు తీయడం లేదు. దీంతో ఏడాదికి వేలకు వేలు డబ్బులు కట్టి ఈఎ్‌సఐ కార్డు తీసుకునే రోగులు ఇప్పుడు ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించాల్సిన పరిస్థితి! గతంలో ఈఎ్‌సఐ డిస్పెన్సరీల్లో షుగర్‌ టెస్టులతోపాటు బీపీ, ఈఎ్‌సఆర్‌, డెంగీ, మలేరియా, టైపాయిడ్‌తో పాటు కంప్లీట్‌ బ్లెడ్‌ పిక్చర్‌ (సీబీపీ) పరీక్షలు కూడా నిర్వహించేవారు. ఇప్పుడు రక్తపరీక్షలు, వైద్య పరీక్షల ఊసే ఎత్తడం లేదు. కొన్ని డిస్పెన్సరీల్లో రక్త పరీక్షలు నిర్వహించడానికి అవసరమైన వైద్య పరికరాలు ఉన్నాయి. కానీ టెస్టింగ్‌కు అవసరమైన రీ ఏజెంట్స్‌ అందించడం లేదు. రీ - ఏజెంట్స్‌ అందుబాటులో లేకపోవడంతో గత రెండేళ్లుగా వైద్య పరికరాలు మొత్తం మూలకు చేరాయి. ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో టెస్టింగ్‌ అనే విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. ప్రపంచవ్యాప్తంగా వైద్యరంగం అభివృద్ధిలో నడుస్తుంటే.. ఈఎ్‌సఐలో మాత్రం పదేళ్లు వెనక్కిపోయింది.


గతంలో రోగులు డాక్టరు వద్దకు వెళ్తే సమస్యను బట్టి మందులు ఇచ్చి పంపించేవారు.  ఆ  మందులకు అనారోగ్య సమస్యలు తగ్గితే తగ్గుతాయి..లేదంటే లేదు. కానీ ఆధునిక కాలంలో రోగికి వచ్చిన ఆనారోగ్యసమస్య ఆధారంగా కొన్ని పరీక్షలు చేసి, సమస్య ఎందుకు వచ్చిందో నిర్ధారించుకుని అప్పుడు మందులు ఇస్తున్నారు. కానీ ఈఎ్‌సఐ ఆస్పత్రుల్లో మాత్రం పాత పద్ధతులే అనుసరిస్తున్నారు. ఎవరైనా రోగి సమస్యతో డిస్పెన్సరీలకు వెళ్తే అక్కడ వైద్యులు చేయడానికి ఏమీ ఉండడం లేదు. పరికరాల కొరతతో వైద్య పరీక్షలు చేసే వీలులేక ఒకటి రెండు రకాల మందులు ఇచ్చి పంపేస్తున్నారు. అవి వాడి, తగ్గకపోతే మళ్లీ రావాలని సూచిస్తున్నారు. రోగి సమస్య తగ్గక రెండోసారి డిస్పెన్సరీకి వస్తే రిఫరల్‌ ఆస్పత్రికో లేక ప్రైవేటు ఆస్పత్రికో పంపించేస్తున్నారు. ఈఎ్‌సఐ డిస్పెన్సరీల్లో కేవలం ట్రీట్‌మెంట్‌ చేస్తున్నారు... కానీ టెస్టింగ్‌ చేయడం లేదు. 


ప్రభుత్వాస్పత్రుల్లో టెస్టులు.. ఈఎస్‌ఐలో మందులు...

ఏడాదికి ఒకసారి డబ్బులు కట్టి ఈఎ్‌సఐ కార్డు తీసుకునేవారు. ఆ కార్డు ఉన్నదన్న ధైర్యం కార్మికుల్లో కనిపించేది. అయితే, గత రెండేళ్లుగా కార్డుదారులు అభ్రదతకు గురవుతున్నారు. చాలా మంది రోగులు ప్రభుత్వాస్పత్రుల్లో రక్త పరీక్షలు, షుగర్‌ పరీక్షలు చేయించుకుని, ఆ రిపోర్టులు తీసుకుని ఈఎ్‌సఐ డిస్పెన్సరీ, ఆస్పత్రులకు వెళ్లి మందులు తీసుకుంటున్నారు. ఎక్స్‌రేల విషయంలోనూ ఇదే దుస్థితి. నాలుగు ఆస్పత్రుల్లోనూ ఎక్స్‌రే మిషన్లు, సీటీ స్కాన్‌ మిషన్లు, అలా్ట్రసౌండ్‌ మిషన్లు సక్రమంగా పని చేయడం లేదు. దీంతో అక్కడ వైద్యులు...ప్రభుత్వాస్పత్రుల్లో స్కానింగ్‌ చేయించుకుని రావాలని  రోగులకు సూచిస్తున్నారు. లేదంటే పైవేటు ఆస్పత్రులకు రిఫర్‌ చేసేస్తున్నారు. అందుతున్న ఫిర్యాదులపై ఈఎస్‌ఐ కార్పొరేషన్‌కు  దృష్టిసారిస్తూనే ఉంది. పూర్తిస్థాయిలో రంగంలోకి దిగితే తప్ప ఈఎ్‌సఐ ఆస్పత్రులు బాగుపడే పరిస్థితి లేదని వైద్య రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-05-31T08:52:06+05:30 IST