సమ్మెపై ఎస్మా చట్టం?

ABN , First Publish Date - 2022-02-05T01:59:26+05:30 IST

ఉద్యోగుల సమ్మెపై ఎస్మా చట్టం ప్రయోగించే యోచనలో ఏపీ

సమ్మెపై ఎస్మా చట్టం?

అమరావతి: ఉద్యోగుల సమ్మెపై ఎస్మా చట్టం ప్రయోగించే యోచనలో ఏపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ఎస్మా ప్రయోగించే విషయమై సాధారణ పరిపాలన శాఖ కసరత్తు చేస్తోంది. అత్యవసర సేవల నిర్వహణ చట్టం ప్రకారం సమ్మె నిలువరించే ప్రయత్నాలు మొదలుపెట్టింది. పౌర సేవలకు విఘాతం కలగకుండా ఎస్మా అమల్లోకి తేవాలని ప్రభుత్వ యోచిస్తోంది. ఉద్యోగుల కార్యాచరణ అనుసరించి నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. సీఎంవోలో మంత్రులు, ఉన్నతాధికారులతో సీఎం సమాలోచనలు చేశారు. సీఎంతో భేటీ తర్వాత కార్యదర్శులు, కలెక్టర్లతో సీఎస్ వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఉద్యోగులు సమ్మెకు వెళ్తే చేపట్టాల్సిన ప్రత్యామ్నాయాలపై సీఎస్ సమీక్ష చేశారు. 


Updated Date - 2022-02-05T01:59:26+05:30 IST