పోలీసులకు వ్యాసరచన పోటీలు

ABN , First Publish Date - 2021-10-26T06:20:37+05:30 IST

పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీసు అధికారులు, సిబ్బందికి... కొవిడ్‌ సమయంలో పోలీసులు అందించిన సేవలు తది తర అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు.

పోలీసులకు వ్యాసరచన పోటీలు
పరిశీలిస్తున్న జిల్లా ఎస్పీ డాక్టర్‌ కాగినెల్లి ఫక్కీరప్ప

అనంతపురం క్రైం, అక్టోబరు 25: పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం పోలీసు అధికారులు, సిబ్బందికి... కొవిడ్‌ సమయంలో పోలీసులు అందించిన సేవలు తది తర అంశాలపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. సివిల్‌, ఏఆర్‌, స్పెషల్‌పార్టీ విభాగాలకు సంబంఽ దించి 42మంది హాజరయ్యారు. ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, ఓఎస్డీ రామకృష్ణప్రసాద్‌, ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు, ఆర్‌ఐలు టైటాస్‌, శివరాముడు, ఆర్‌ఎస్‌ఐ మగ్బూల్‌తో కలిసి పర్యవేక్షించారు. 

పోలీసు విధులు, త్యాగాలపై అవగాహన కల్పించండి : ఎస్పీ

పోలీసు అమర వీరుల వారోత్సవాల్లో భాగంగా ప్రజలకు పోలీసుల విధులు, వారి త్యాగాలపై విస్తృత అవగాహన కల్పించాలని జిల్లా ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప సోమవా రం ఓ ప్రకటన ద్వారా ఆదేశించారు.  పోలీసు త్యాగాలు, పరాక్రమాలు తెలియజేసే విధంగా బుధవారం ఆయా ప్రాంతాల వారీగా సినిమా థియేటర్లు, టీవీలలో ప్రద ర్శన చేయించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా  27న సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా అవగాహన కల్పించాలని, 28న వైద్యశిబిరాలు, రక్తదాన కార్యక్రమాలు చేపట్టా లన్నారు. ఈనెల 30న పోలీసు అమర వీరుల కుటుంబాల్లోని ప్రత్యేక సాధకులను గుర్తించి సన్మానిస్తామన్నారు. ఈనెల 31వ తేదీన జిల్లా వ్యాప్తంగా సమైక్యతా పరుగు (రన ఫర్‌ యూనిటీ) నిర్వహించి వారోత్సవాలను  ముగిస్తామని తెలిపారు. 

పిల్లల విషయంలో జాగ్రత్త

జిల్లాలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిల్లలు చెరువులు, బావులు, వంకలవైపు వెళ్లకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ డాక్టర్‌  ఫక్కీరప్ప సోమవారం ఓ ప్రకటన ద్వారా విజ్ఞప్తి చేశారు. వర్షాలు జోరుగా కురుస్తున్న నేప థ్యంలో జిల్లాలోని వాగులు, వంకలు, కాలువలు, గుంతలు ఎక్కువ నీటితో పొంగి పొర్లుతున్నాయని గుర్తుచేశారు. రోడ్లపై నీరు ప్రవహిస్తుంటే జాగ్రత్తగా గమ్యాన్ని చేరుకోవాలని సూచించారు. ఇలాంటి సమయంలో ఎలాంటి ఘటనలకు తావు లేకుండా స్థానిక పోలీసులు ఆయా ప్రాంతాల రెవెన్యూ,  మున్సిపాలీటీ, పంచాయతీ అధికారులతో కలిసి తగిన నియంత్రణ చర్యలు చేపట్టాలని ఆయన తెలియజేశారు. ప్రధానంగా విద్యుత ప్రమాదాలు జరగకుండా జాగ్రత్త పడాలని సూచించారు.

 బాధ్యతగా పనిచేయండి : ఏఆర్‌ అదనపు ఎస్పీ

ప్రతిఒక్కరూ తమ విధుల్లో బాధ్యతగా పనిచేయాలని ఏఆర్‌ అదనపు ఎస్పీ హనుమంతు పేర్కొన్నారు. ఈ మేరకు ఏపీఎస్పీ నుంచి కన్వర్షన కింద ఏఆర్‌ వి భాగంలోకి వచ్చిన సిబ్బందికి సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో 15 రోజుల ఓరియంటేషన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందికి పలు అంశాలపై దిశ నిర్దేశం చేశారు.  

కరోనా కాలంలో పోలీసుల సేవలు అమోఘం

బుక్కరాయసముద్రం: కరోనా మహమ్మారి విజృంభించిన సమయంలో పోలీ సులు అందించిన సేవలు అమోఘమని ఏపీఎస్పీ 14వ బెటాలియన కమాండెం ట్‌ ప్రకాష్‌ కొనియాడారు.  మండల పరిధిలోని ఎస్‌ఆర్‌ఐటీ ఇంజనీరింగ్‌ కళాశా లలో సోమవారం పోలీసుల అమరవీరుల దినోత్సవాన్ని పురస్కరించుకుని ‘కరోనా సమయంలో పోలీసుల నిస్వార్థసేవ’ అనే అంశంపై చర్చావేదిక ఏర్పాటు చేశారు. 14వ బెటాలియన కమాండెంట్‌ ప్రకాష్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. కార్యక్రమంలో అడిషనల్‌ కమాండెంట్‌ నాగేశ్వరప్ప, ఆర్‌ఐలు లోకేశ్వర్‌నాయుడు, షెక్షావలి తదితరులు పాల్గొన్నారు.

రాప్తాడు: మండలంలోని హంపాపురం సమీపంలో ఉన్న శ్రీవెంకటేశ్వర ఇంజనీరింగ్‌ కళాశాలలో విద్యార్థులకు రాప్తాడు ఎస్‌ఐ రాఘవరెడ్డి వ్యాసరచన పోటీలు నిర్వహించారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా సోమవారం ‘కరో నా సమయంలో పోలీసుల విధులు’ అనే అంశంపై పోటీలు నిర్వహించారు. కా ర్యక్రమంలో పోలీసు సిబ్బంది, కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-26T06:20:37+05:30 IST