తెలంగాణలో కోచ్‌ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2022-06-16T08:39:48+05:30 IST

తెలంగాణ ఆర్థిక పురోగతి కోసం వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో సమీకృత ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది.

తెలంగాణలో కోచ్‌ ఫ్యాక్టరీ, ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయండి

కేంద్రానికి పార్లమెంటరీ కమిటీ సిఫారసు 

న్యూఢిల్లీ, జూన్‌ 15 (ఆంఽధ్రజ్యోతి): తెలంగాణ ఆర్థిక పురోగతి కోసం వరంగల్‌లో రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ, బయ్యారంలో సమీకృత ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వానికి వాణిజ్య శాఖ పార్లమెంటరీ స్థాయీ సంఘం సిఫారసు చేసింది. ఈ మేరకు కమిటీ ఈ-కామర్స్‌ అంశాలపై అధ్యయనం చేసి రూపొందించిన నివేదికను వైసీపీ ఎంపీ, కమిటీ చైర్మన్‌ విజయసాయి రెడ్డి బుధవారం రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడుకు అందజేశారు. ఈ రెండు ప్రాజెక్టులు రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి తోడ్పడడమే కాకుండా ఈ-కామర్స్‌ మార్కెట్ల వంటి రంగాలు కూడా అభివృద్ధి చెందుతాయని కమిటీ సమావేశాల్లో రాష్ట్ర ప్రభుత్వ అధికారులు చెప్పారని నివేదిక పేర్కొంది. హైదరాబాద్‌-బెంగళూరు, హైదరాబాద్‌-వరంగల్‌, హైదరాబాద్‌-నాగ్‌పూర్‌ పారిశ్రామిక కారిడార్ల అభివృద్ధిలో జాప్యం కారణంగా హైదరాబాద్‌ నుంచి ఇతర పట్టణాలకు లాజిస్టిక్స్‌ నెట్‌వర్క్‌కు విఘాతమేర్పతోందని వెల్లడించింది. రాష్ట్రానికి నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ అవసరమన్నారని పేర్కొంది. 

Updated Date - 2022-06-16T08:39:48+05:30 IST