Advertisement

ఐసోలేషన్‌ ఏర్పాటు చేయాలని రాస్తారోకో

Aug 1 2020 @ 06:09AM

అయిజ, జూలై 31 : జోగుళాంబ గద్వాల జిల్లాలోని అయిజ మండల కేంద్రంలో ఐసోలేషన్‌ వార్డును ఏర్పాటు చేయాలని కాంగ్రెస్‌ నాయకులు డిమాండ్‌ చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం అయిజలోని గద్వాల ప్రధాన రహదారిపై బైఠాయించారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ అయిజలో రోజు రోజుకు కరోనా కేసులు పెరుగుతున్నాయని, బాధితుల సౌకర్యార్థం ఇక్కడ ఐసోలేషన్‌ వార్డులను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్‌ ఓబీసీ రాష్ట్ర కార్యదర్శి షేక్షావళి, కౌన్సిలర్లు రాణి, దేవరాజు, నాయకులు తిప్పన్న, సాంబశివుడు పాల్గొన్నారు.


కేసు నమోదు

కొవిడ్‌-19 నిబంధనలకు వ్యతిరేకంగా రాస్తారోకో చేసిన కాంగ్రెస్‌ నాయకులపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ జగదీష్‌ తెలిపారు. షెక్షావలి, ఆచారి, రాణి, దేవరాజు, సాంబశివుడు, ఫిరోజ్‌, తిప్పన్నతో కలిపి 20 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.

Follow Us on:
Advertisement
Advertisement