సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2021-04-18T05:01:37+05:30 IST

కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటుచేసుకోవాలని డైరెక్టర్లు చంద్రశేఖర్‌, బలరాం, సత్యనారాయణరావు సూచించారు.

సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటు చేయండి
అధికారులతో మాట్లాడుతున్న డైరెక్టర్‌(పా) చంద్రశేఖర్‌

- కరోనా నివారణకు పటిష్ట చర్యలు చేపట్టండి  

- జీఎంలకు, సూపరింటెండెంట్లకు డైరెక్టర్‌(పా) సూచన

గోదావరిఖని, ఏప్రిల్‌ 17: కరోనా విజృంభిస్తున్న నేపథ్యం లో సింగరేణి ఏరియా ఆసుపత్రిలో ఐసోలేషన్‌ వార్డులు ఏర్పాటుచేసుకోవాలని డైరెక్టర్లు చంద్రశేఖర్‌, బలరాం, సత్యనారాయణరావు సూచించారు. శనివారం ఆర్‌జీ-1 జీఎం కార్యాలయంలో డైరెక్టర్‌(పా) చంద్రశేఖర్‌ జీఎంలకు, సూపరింటెండెంట్లకు దిశానిర్దేశం చేశారు. గనుల్లో, డిపార్ట్‌మెంట్లలో కరోనా నివారణకు హోపోక్లోరైడ్‌ ద్రావణం, థర్మల్‌ స్కానర్లు, శానిటైజర్లు పల్స్‌ ఆక్సా మీటర్లు అందుబాటులో ఉంచాలని, ప్రతి ఉద్యోగి మాస్క్‌లు ధరించాలని, కరోనా వ్యాక్సిన్‌ తీసు కునే విధంగా ఉద్యోగులకు అవగాహన కల్పించాలని సూ చించారు. కార్మికులు మాస్‌ గ్యాథరింలకు వెళ్లరాదని, ఐసో లేష్‌ వార్డుల్లో అవసరమైన డాక్టర్లకు, పారామెడికల్‌ సిబ్బందిని అందుబాటులో ఉంచుకోవాలని, వారికి ప్రత్యేక ఇన్సెం టివ్‌ ఇవ్వాలని, ఏరియా ఆసుపత్రిలో హెల్ప్‌ డెస్క్‌లను ఏ ర్పాటు చేసుకోవాలని, పాజిటివ్‌ వచ్చిన రోగులను తప్పకుం డా ఏరియా ఆసుపత్రిలోని హోమ్‌ క్వారంటైన్‌లో ఉండే వి ధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎంఓ మాంత శ్రీనివాస్‌, జీఎం కల్వల నారాయ ణ, డీవైసీఎంఓ కిరణ్‌రాజ్‌, డీజీఎం(క్వాలిటీ) సలీం, ఎస్‌ఈ దాసరి శ్రీనివాస్‌, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ పద్మ పాల్గొన్నారు.

Updated Date - 2021-04-18T05:01:37+05:30 IST