ఐఐటీ-హెచ్‌లో బీవీఆర్‌ సీయంట్‌ ఏర్పాటు

ABN , First Publish Date - 2022-07-01T06:02:36+05:30 IST

ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (బీవీఆర్‌ సీయంట్‌)ను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌)లో ఏర్పాటు చేయనున్నారు.

ఐఐటీ-హెచ్‌లో బీవీఆర్‌ సీయంట్‌ ఏర్పాటు

రూ.10 కోట్లతో స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అభివృద్ధి.. రేపు శంకుస్థాపన

కంది, జూన్‌ 30 : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ (బీవీఆర్‌ సీయంట్‌)ను ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ హైదరాబాద్‌ (ఐఐటీహెచ్‌)లో ఏర్పాటు చేయనున్నారు. సీయంట్‌ ఫౌండేషన్‌, శిబిధి ఫౌండేషన్‌లు బీవీఆర్‌ సీయంట్‌ ఏర్పాటు కోసం రూ.10 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఇందుకోసం ఈ రెండు ఫౌండేషన్‌లు మార్చిలో ఒప్పందం చేసుకున్నాయి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తల్లో నైపుణ్యాలను పెంపొందించే ఈ కేంద్రాన్ని శనివారం ఐఐటీ-హెచ్‌లో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ శంకుస్థాపన చేయనున్నట్లు గురువారం ఐఐటీహెచ్‌ అధికారులు వెల్లడించారు. 18 నెలల్లో పాఠశాల భవనాన్ని నిర్మించే బాధ్యత ఈ రెండు ఫౌండేషన్లపై ఉంటుంది. ఈ పాఠశాల భవనంలో ఫ్యాకల్టీ ఆఫీసులు, ఇన్నోవేటర్స్‌ స్పేస్‌, కాన్ఫరెన్సు, సెమినార్‌ హాళ్లు, కంప్యూటేషనన్‌ ల్యాబ్‌, బిహేవియర్‌ ల్యాబ్‌, పరిశోధనా స్థలం ఉంటాయి. అంతేగాక స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అభివృద్ధి కోసం, ఐదేళ్ల పాటు పునరావృత ఖర్చుల నిమిత్త రూ. 10 కోట్లు ఈ రెండు ఫౌండేషన్‌లు అందిస్తాయి. ఐఐటీ-హెచ్‌ బీవీఆర్‌ మోహన్‌రెడ్డి స్కూల్‌ ఆఫ్‌ ఇన్నోవేషన్‌ అండ్‌ ఎంటర్‌ ప్రెన్యూర్‌షి్‌పదేశం నుంచి ప్రపంచస్థాయి ఆవిష్కరణలు, వ్యవస్థాపక ప్రతిభను పెంపొందించడంమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు డైరెక్టర్‌ బీస్‌మూర్తి అన్నారు.  

Updated Date - 2022-07-01T06:02:36+05:30 IST