సాలికమల్లవరం- పొగచెట్లపాలెం మధ్య ఫారెస్టు చెక్‌పోస్టు ఏర్పాటు

ABN , First Publish Date - 2021-04-24T05:18:05+05:30 IST

మండలంలోని సాలికమల్లవరం- పొగచెట్లపాలెం గ్రామాల మధ్య అటవీ శాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టు ఏర్పాటైం

సాలికమల్లవరం- పొగచెట్లపాలెం మధ్య  ఫారెస్టు చెక్‌పోస్టు ఏర్పాటు
సాలికలమల్లవరం- పొగచెట్లపాలెం గ్రామాల మధ్య ఏర్పాటైన చెక్‌పోస్టు


గొలుగొండ, ఏప్రిల్‌ 23 : మండలంలోని సాలికమల్లవరం- పొగచెట్లపాలెం గ్రామాల మధ్య అటవీ శాఖ ఆధ్వర్యంలో చెక్‌పోస్టు ఏర్పాటైంది. కరక, సాలికమల్లవరం రంగురాళ్ల క్వారీల్లో అక్రమ తవ్వకాలు చేపట్టంతో ఈ ప్రాంతంలో చెక్‌పోస్టు ఏర్పాటు చేయాలని డీఎఫ్‌వో వినోద్‌కుమార్‌ కరక రిజర్వు ఫారెస్టు సెక్షన్‌ ఆఫీసర్‌ సతీశ్‌కు ఆదేశించినట్టు ఫారెస్టు సెక్షన్‌ అధికారి తెలిపారు. దీంతో శుక్రవారం చెక్‌పోస్టు ఏర్పాటు చేశామన్నారు. అలాగే, గొలుగొండ మండలం నుంచి నాతవరం మండలానికి అనుమతులు లేకుండా కలప రవాణాపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసినట్టు చెప్పారు. కరక రిజర్వు ఫారెస్టులో రంగురాళ్ల తవ్వకాలపై నిరంతరం నిఘా ఏర్పాటు చేశామని వివరించారు. ఈ కార్యక్రమంలో కరక బీట్‌ ఆఫీసర్‌ నూకరాజు,  సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2021-04-24T05:18:05+05:30 IST