పరిశ్రమల స్థాపన వేగంగా జరగాలి: కలెక్టర్‌

ABN , First Publish Date - 2022-07-03T07:16:59+05:30 IST

పరిశ్రమల స్థాపన వేగంగా జరగాలి అని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు.

పరిశ్రమల స్థాపన వేగంగా జరగాలి: కలెక్టర్‌
సమావేశంలో ప్రసంగిస్తున్న కలెక్టర్‌ వెంకట రమణారెడ్డి

44 ఎంఎ్‌సఎంఈలకు రూ.2.72కోట్ల రాయితీ మంజూరుకు ఆమోదం


తిరుచానూరు, జూలై 2: ‘తిరుపతి జిల్లా ఏర్పడిన నాటి నుంచి సింగిల్‌ డెస్క్‌ విధానంతో దరఖాస్తులు చేసుకున్న 172 మంది అనుమతులు పొందారు. అంతేవేగంగా పరిశ్రమలు స్థాపన జరగాలి’ అని కలెక్టర్‌ వెంకటరమణారెడ్డి అన్నారు. శనివారం ఆయన పారిశ్రామికవేత్తలు, ఔత్సాహికులతో సమావేశమయ్యారు. పరిశ్రమల ప్రాధాన్యం, అనుమతులు, రాయితీల మంజూరుపై సమీక్షించారు. పరిశ్రమల స్థాపనకు ఏపీఐఐసీ భూములు అందుబాటులో ఉన్నాయని, వసతుల కల్పనకు జిల్లా యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. క్లస్టర్‌ డెవలప్మెంట్‌ ప్రోగామ్‌ ద్వారా పరిశ్రమల ప్రతినిధులు కనీసం 20మంది గ్రూప్‌ కాగలిగితే కేంద్ర ప్రభుత్వం 70శాతం, రాష్ట్రం 20శాతం, సబ్సిడీ ఇస్తుందన్నారు. 10శాతం షెడ్‌ ఉండాలని, మొదటిదశలో రెండు క్లస్టర్లు ఏర్పాటు జరగాలన్నారు. స్కూటినీ కం వెరిఫికేషన్‌ కమిటీ సూచించిన 44 మధ్య, చిన్న, సూక్ష్మ పరిశ్రమ స్థాపకుల (ఎంఎ్‌సఎంఈల)కు రూ.2.72కోట్ల పెట్టుబడి సబ్సిడీ, విద్యుత్‌, వడ్డీ, అమ్మకపు పన్ను, స్టాంప్‌ డ్యూటీ వంటివి మంజూరుకు ఆమోదం తెలిపారు. ఈ సమావేశంలో తుడా వీసీ హరికృష్ణ, జిల్లా పరిశ్రమలశాఖ అఽధికారి ప్రతా్‌పరెడ్డి, ఏపీఐఐసీల జడ్‌ఎంలు తిరుపతి సుహానాసోని, నాయుడుపేట చంద్రశేఖర్‌, పీసీబీ ఈఈ నరేంద్ర, రామకృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-07-03T07:16:59+05:30 IST