నిబంధనల మేరకే టపాకాయల దుకాణాల ఏర్పాటు

ABN , First Publish Date - 2021-10-26T07:11:33+05:30 IST

నిబంధనల మేరకే టపాకాయల దుకాణాలను ఏర్పాటుచేయాలని తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి పేర్కొన్నారు.

నిబంధనల మేరకే టపాకాయల దుకాణాల ఏర్పాటు

తిరుపతి(పద్మావతినగర్‌), అక్టోబరు 25: నిబంధనల మేరకే టపాకాయల దుకాణాలను ఏర్పాటుచేయాలని తిరుపతి ఆర్డీవో కనకనరసారెడ్డి పేర్కొన్నారు. అగ్నిమాపక, పోలీస్‌, రెవెన్యూ అధికారులు, లైసెన్స్‌ కలిగిన టపాకాయల విక్రయదారులతో సోమవారం ఆయన సమావేశమయ్యారు. తిరుపతిలోని నెహ్రూ మున్సిపల్‌ పాఠశాల క్రీడా మైదానం, రైతుబజారు, ఎగ్జిబిషన్‌ గ్రౌండ్‌లో మాత్రమే దుకాణాలను ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. ఆయా ప్రదేశాలను అధికారులు పరిశీలించి, ఏ ప్రాంతంలో ఎన్ని దుకాణాలు ఏర్పాటు చేయొచ్చో అంచనా వేయాలన్నారు. అధికారుల నిర్ణయం మేరకు ఈనెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలకు అనుమతులు జారీ చేస్తామని చెప్పారు. జీఎస్టీ రిటర్న్స్‌, విద్యుత్‌ ధ్రువీకరణ పత్రం తప్పనిసరిగా ఉండాలని, దుకాణాల మధ్య కనీసం మూడు మీటర్లు దూరం ఉండాలన్నారు. ప్రతి దుకాణం వద్ద ఇసుక, నీటి డ్రమ్‌ ఉంచుకోవాలన్నారు. ఈ సమావేశంలో ఫైర్‌ ఆఫీసర్‌ కిరణ్‌కుమార్‌రెడ్డి, నగరపాలకసంస్థ ఫైర్‌ ఆఫీసర్‌ శ్రీనాఽథరెడ్డి, స్పెషల్‌ బ్రాంచ్‌ సీఐ సత్యనారాయణ, జీఎస్టీ అధికారులు చెన్నారెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, అర్బన్‌ తహసీల్దారు వెంకటరమణ, తుడా అధికారిణి సూర్యనారాయణమ్మ, డీటీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-26T07:11:33+05:30 IST