Advertisement

సాయం చెయ్యండి... ఈశ్వర్‌ని 2వ సారి విజేతగా నిలపండి

Dec 5 2020 @ 12:21PM

ఈశ్వర్‌కు లెక్కలు చెయ్యడమంటే చాలా ఇష్టం... క్రికెట్ ఆడాలని, కుటుంబంతోను, స్నేహితులతోను సమయం గడపాలని మరీ మరీ కోరుకుంటాడు. తన అమ్మానాన్నలు ఈ పిల్లవాడే కంటి వెలుగు. ఏ విషయంలోనైనా చురుకుగా ఉండే ఈశ్వర్‌ది పేద కుటుంబమే అయినా చదువులో తను ఎప్పుడూ ముందుంటాడు. ఈశ్వర్ ఇప్పుడు ఒక అగ్నిపరీక్షను ఎదుర్కుంటున్నాడు....


నాలుగున్నరేళ్ళ కిందట, అంటే... 2016 జులై నెలలో ఈశ్వర్ అనారోగ్యానికి గురయ్యాడు. వారం పాటు ఆగకుండా తీవ్రమైన జ్వరంతో బాధపడ్డాడు. అతని అమ్మానాన్నా దగ్గరున్న డాక్టర్ దగ్గరకు తీసుకెళితే కొన్ని మెడిసిన్స్ రాసిచ్చారు. అప్పుడు జ్వరం తగ్గింది కానీ, కొద్ది రోజుల్లోనే మళ్ళీ జ్వరం బారిన పడ్డాడు.


ఈసారి జ్వరంతో పాటు ఈశ్వర్ తీవ్రమైన వాంతులతో బాధపడాల్సి వచ్చింది. కొద్ది రోజుల్లోనే ఈ అబ్బాయి ఆరోగ్యం క్రమంగా క్షీణిస్తూ వచ్చింది. ఈశ్వర్ అమ్మానాన్నా తల్లడిల్లిపోతూ ఆసుపత్రికి తీసుకెళ్ళారు.


ఆసుపత్రిలో ఈశ్వర్‌కు వరుసగా కొన్ని రక్తపరీక్షలు చేశారు. చివరికి ఎంతో నిరీక్షణ తర్వాత, ఈశ్వర్ తీవ్రమైన అనారోగ్య సమస్యలతో ఉన్నాడని కుటుంబ సభ్యులకు సమాచారం అందింది. ఈ పిల్లవాడు బ్లడ్ క్యాన్సర్ (acute lymphoblastic leukaemia) బారిన పడ్డాడని డాక్టర్లు చెప్పారు. కేవలం 16 ఏళ్ళ వయసుకే ఈశ్వర్ మొత్తం జీవితం తల్లకిందులైపోయింది.


ఈశ్వర్ డయాగ్నోసిస్ ఆ కుటుంబాన్ని షాక్‌కి గురి చేసి డిప్రెషన్‌లోకి నెట్టింది.


"ఎంతో చురుకుగా ఉండే మా అబ్బాయికి ఇంత పెద్ద జబ్బు ఎలా వచ్చింది?" అని ఈశ్వర్ తల్లి రేయింబవళ్ళూ రోదిస్తూ తన కొడుకును కాపాడమని దైవాన్ని ప్రార్థిస్తూనే ఉంది.


రోజుకూలీగా పని చేస్తున్న ఈశ్వర్ తండ్రి శ్రీనివాస్ తన కొడుకును కాపాడుకోవడానికి చెయ్యగలిగిందంతా చేశాడు కానీ అది చాలదు. కొడుక్కి చికిత్స చేయించడానికి అప్పు కోసం బంధుమిత్రులందరి వద్దా చేయి చాచాడు.


సుమారు రెండేళ్ళ పాటు ఈశ్వర్ ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాటం చేస్తూ వచ్చాడు. లెక్కలేనన్ని సార్లు కీమోథెరపీ సెషన్స్‌కు హాజరై, తన కుటుంబానికి, తనను ఎంతో ప్రేమించే ఆత్మీయులకు దూరంగా ఆసుపత్రిలో ఎన్నో రాత్రులు ఒంటరిగా గడిపాడు.


ఈశ్వర్ మానసికంగా, శారీరకంగా బలహీనపడినా... నొప్పిని భరించాడు. చివరికి 2018లో క్యాన్సర్‌ని జయించాడు.


ఇక సాధారణ జీవితం వైపు అడుగులేస్తున్న ఈశ్వర్ 100 శాతం చదువుపైనే దృష్టి పెట్టి, కాలేజీలో కంప్యూటర్ సైన్స్ సీటు దక్కించుకున్నాడు. తను చార్టెడ్ అకౌంటెంట్ కావాలని, తన కోసం ఎంతో త్యాగం చేసిన కుటుంబం రుణం తీర్చుకోవాలని తపనపడుతున్నాడు. దురదృష్టవశాత్తు ఈ సంవత్సరం అతనికి క్యాన్సర్ మళ్లీ తిరగబెట్టింది.


ఈసారి ఈశ్వర్‌కి కీమోథెరపీతో పాటు అదనంగా బోన్ మారో ట్రాన్స్‌ప్లాంటేషన్ కూడా జరగాల్సి ఉంది. ఇందుకు అతని కుటుంబం రూ.30 లక్షల ($ 40588.83) ఖర్చు భరించాల్సి ఉంటుంది.


ఈశ్వర్ చికిత్స కోసం ఇంత భారీగా ఖర్చు చెయ్యాల్సి రావడం అతని కుటుంబాన్ని కోలుకోలేని దెబ్బ తీస్తోంది. తనకు మొదటిసారి క్యాన్సర్ వచ్చినప్పుడు చేయించిన చికిత్సకు పెట్టిన ఖర్చుతోనే ఆ కుటుంబం దగ్గరున్న డబ్బంతా అయిపోయింది. వారి దగ్గర ఇంకేమీ మిగల్లేదు. ఈశ్వర్ తండ్రి శ్రీనివాస్ మళ్ళీ చాలాచోట్ల అప్పు చెయ్యాల్సి వచ్చింది... ఈశ్వర్ తల్లి తనకున్న నగలు మొత్తం అమ్మేసింది.

 

ఈశ్వర్ గత 40 రోజులుగా ఆసుపత్రిలోనే ఉన్నాడు. రోజులు గడుస్తున్న కొద్ది తన పరిస్థితి దిగజారుతోంది. తన చర్మం నిండా దద్దుర్లు వచ్చి ఎంతో బాధ కలిగిస్తున్నాయి. చిగుళ్ళ నుంచి రక్తం వస్తోంది. ఇప్పటికే ఐదు సార్లు రక్తమార్పిడి జరిగింది. ఈశ్వర్‌కు తండ్రి శ్రీనివాసే డోనార్ అయ్యాడు.


"ఒక తండ్రిగా ఈశ్వర్ కోసం ఏమైనా చేస్తాను... నాకున్నదంతా ఇచ్చేశాను. నా కొడుకు జీవితం కోసం నా దేహాన్ని ఇవ్వడానికి కూడా సిద్ధమే" అంటూ ఆగని కన్నీటి ధారతో చెప్పాడు శ్రీనివాస్.


ఈశ్వర్ జీవితాన్ని నిలబెట్టడం కోసం తన శరీరం నిండా రోజంతా సూదులు గుచ్చాల్సి వచ్చింది. బాధను భరిస్తూ అలా పడి ఉన్నాడు. తన కుటుంబం నిస్సహాయంగా చూస్తోంది.


ఈశ్వర్ వయసు కేవలం 20 ఏళ్ళు. ఎంతో తెలివైనవాడు, చిన్న వయసులోనే ఎన్నో కష్టాలు ఎదురైనా తట్టుకుని నిలబడి తనను తాను నిరూపించుకున్నాడు. ఈశ్వర్‌ని చూసి ఎంతో గర్వపడే తల్లిదండ్రులు ఇప్పుడు.... అతన్నిలా చూడాల్సి రావడం ఎంతో బాధాకరం. ఒకసారి క్యాన్సర్‌ని జయించిన తమ కొడుకు, ఈసారి ఓడిపోడు కదా... అనే ఆలోచనే వారు తట్టుకోలేకపోతున్నారు.


ఇప్పుడు ఈశ్వర్‌కి మీ సాయం ఎంతో అవసరం. తనను రెండోసారి క్యాన్సర్ విజేతగా నిలబెట్టేందుకు ముందుకు రండి. పెద్ద మనస్సుతో మీ వల్ల సాధ్యపడినంత సాయాన్ని విరాళంగా ఇవ్వండి...


Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.