మొదలైన దోస్త్‌

ABN , First Publish Date - 2022-07-03T06:39:34+05:30 IST

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ అడ్మిషన్‌ల కోసం దోస్త్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టా రు. విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల చివరి వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తులు చేయడంతో పాటు ఈనెల 6 నుంచి వెబ్‌ఆప్షన్‌లను చేసుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోని

మొదలైన దోస్త్‌
తెలంగాణ విశ్వవిద్యాలయం

జిల్లాలోని డిగ్రీ కళాశాలల్లో అడ్మిషన్‌లు

ఈ నెల 30వ తేదీ వరకు దోస్త్‌ ద్వారా దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం

ఆగస్టు 6న మొదటి విడత సీట్ల ప్రకటన

ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు మొగ్గుచూపుతున్న విద్యార్థులు

ప్రైవేట్‌ కళాశాలల్లో వసతులను పట్టించుకోని విశ్వవిద్యాలయం అధికారులు

నిజామాబాద్‌, జూలై 2(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ అడ్మిషన్‌ల కోసం దోస్త్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ మొదలుపెట్టా రు. విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో సీట్ల భర్తీకోసం దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల చివరి వరకు అవకాశం ఇచ్చారు. దరఖాస్తులు చేయడంతో పాటు ఈనెల 6 నుంచి వెబ్‌ఆప్షన్‌లను చేసుకోవాలని కోరారు. ఉమ్మడి జిల్లాలోని అన్ని కళాశాలల్లో సీట్ల భర్తీ అయ్యేందుకు చర్యలు చేపట్టారు. ఆ కళాశాల పరిదిలో ఉన్న కోర్సులను అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రైవేట్‌ కళాశాలల అద్యాపకులు ప్రయత్నాలు చేస్తున్నారు. విద్యార్థుల ను తమ కళాశాలలో చేర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. 

ఉమ్మడి జిల్లాలో మొత్తం 65 కళాశాలలు

తెలంగాణ విశ్వవిద్యాలయం పరిదిలో ఉమ్మడి జిల్లాలో మొత్తం 65 కళాశాల లు ఉన్నాయి. వీటిలో ప్రభుత్వ కళాశాలలు 11 ఉండగా 54 కళాశాలలు ప్రైవేట్‌ లో ఉన్నాయి. వీటిలో 33,090 సీట్లు ఉన్నాయి. గత సంవత్సరం ఈ కళాశాలలో 65శాతం సీట్లు 17160 భర్తీ అయ్యాయి. మిగతా సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఇంటర్మీడియట్‌పాస్‌ అయిన విద్యార్థుల కోసం ఈ కళాశాల పరిదిలో బీఏ, బీఎస్సీ, బీకాం. బీకాం ఒకేషనల్‌, బీఎస్‌డబ్ల్యు, బీబీఏ, బీసీఏ వంటి కోర్సులతో పాటు బీఎస్సీలో మ్యాథ్స్‌, సైన్స్‌ కోర్సులను అందిస్తున్నారు. ఉమ్మడి జిల్లా పరిదిలో ఎక్కువగా ప్ర భుత్వ కళాశాలలకు డిమాండ్‌ ఉంది. నిజామాబాద్‌లోని గిరిరాజ్‌, మహిళ డిగ్రీ కళాశాల, కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలకు ఎక్కువగా డిమాండ్‌ ఉంది. వీటితో పాటు ఆర్మూర్‌, భీంగల్‌, మోర్తాడ్‌, బోధన్‌ డిగ్రీ కళాశాలలకు కూడా ఎక్కువగా పోటీ ఉంది. బాన్సూవాడ కళాశాలకు అన్ని వసతులు ఉండడంతో ఆ డివిజన్‌ పరిదిలోని విద్యార్థులు ఎక్కువగా పోటిపడుతున్నారు. బిచ్కుంద ప్రభుత్వ కళాశాలకు కూడా ఎక్కువగానే విద్యార్థులు దరఖాస్తులు చేస్తున్నారు. ఇవేకాకుండా ప్రైవేట్‌ డిగ్రీ కళాశాలలో కంప్యూటర్‌ సంబందిత కోర్సులతో పాటు బీఎస్సీ మ్యాథ్స్‌, సైన్స్‌, అప్లైడ్‌ సైన్స్‌ కోర్సుల్లో ఎక్కువమంది విద్యార్థులు చేరుతున్నారు. ఇవేకాకుండా బీకాం కంప్యూటర్స్‌, ట్యాక్స్‌స్‌కు ఎక్కువ డిమాండ్‌ ఉంది. విద్యార్థులు డిగ్రీ తర్వాత ఉన్నత విద్యా చదువుకోవడంతో పాటు డిగ్రీస్థాయిలోనే ఉపాది పొందేందుకు ఒకేషనల్‌, కంప్యూటర్‌, అప్లైడ్‌సైన్స్‌ సంబందిత కోర్సులు ఉపయోగపడుతున్నాయి.

ఈనెల 30 వరకు అవకాశం

టీయూ పరిదిలోని ఉమ్మడి జిల్లాలోని కళాశాలలో దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 30వ తేదీ వరకు అవకాశం ఇచ్చారు. డిగ్రీ కోసం దరఖాస్తులు చేయడంతో పాటుఈ నెల 6నుంచి వెబ్‌ ఆప్షన్‌లో ఇష్టమైన కోర్సుకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. కాలేజీలో మొత్తం ఆప్షన్‌లను పొందుపర్చారు. ఏయే కాలేజ్‌లలో విద్యార్థి చేరేందుకు ఈ ఆప్షన్‌కు అవకాశం ఈ నెల 30వరకు ఇచ్చారు. ఆగస్టు 6న ఫస్ట్‌ పేస్‌ సీట్ల అలాట్‌మెంట్‌నువెబ్‌ ఆప్షన్‌కు అనుగుణంగా చేస్తారు. ఆగస్టు 7నుంచి 18 వరకు కళాశాలలో చేరేందుకు అవకా శం ఇస్తారు. ఫస్ట్‌ఫేస్‌లో సీట్లు రానివారి కోసం మళ్లి దరఖాస్తు చేసుకునేందుకు ఆగస్టు 21 వరకు అవకాశం ఇచ్చారు. ఆగస్టు 28న 2వ ఫేస్‌ సీట్ల అలాట్‌మెంట్‌ చేస్తారు. సెప్టెంబర్‌ 10 వరకు కళాశాలలో చేరేందుకు అవకాశం ఇచ్చారు. డిగ్రీ సీట్ల కోసం 3వ సారి వెబ్‌ ఆప్షన్‌ చేసుకునేందుకు సెప్టెంబర్‌ 12వరకు అవకాశం ఇచ్చారు. ఈ దరఖాస్తు చేసుకునేవారికి సెప్టెంబర్‌ 16న థర్డ్‌పేస్‌ సీట్లను అలాట్‌మెంట్‌ చేస్తారు. సెప్టెంబర్‌ 31న డిగ్రీ అడ్మిషన్‌లను క్లోజ్‌ చేస్తారు. 

కొన్ని కళాశాలల్లోనే వసతులు

టీయూ పరిధిలో మొత్తం 65 కళాశాలలు ఉన్నా.. కొన్ని కళాశాలల్లో 30శాతం కూడా సీట్లు భర్తీకావడంలేదు. కొన్ని కళాశాలల్లో వసతులు ఉండడం వల్ల ఎక్కు వమొత్తంలో విద్యార్థులు చేరుతున్నారు. టీయూ పరిదిలో ప్రతి సంవత్సరం ఈ కళాశాలలో 65శాతం నుంచి 70శాతంలోపే సీట్ల భర్తీ అవుతున్నాయి. ఉమ్మడి జిల్లాలో చదువుకుంటున్న విద్యార్థులు ఎక్కువమంది ఇంటర్మీడియట్‌ పాస్‌ కాగా నే ప్రొఫెనల్‌ డిగ్రీ అయినఇంజనీరింగ్‌, మెడిసిన్‌, ఫార్మసి, అగ్రికల్చర్‌, వెటర్నరి, ఆయుర్వేదిక్‌, హర్టికల్చర్‌, హోమియోపథి, యూనిని కోర్సుల్లో చేరుతున్నారు. ఇదే కాకుండా న్యూట్రిషన్‌, ఫ్యాషన్‌డిజైన్‌ వంటి డిగ్రీ కోర్సుల్లో ఎక్కువగా చేరుతున్నా రు. ఇంటర్మియట్‌ ఎంపీసీ, బైపీసీ చదివిన వారు ప్రొఫెషనల్‌ కోర్సుల్లో సీట్లురాకపోతే హైదరాబాద్‌లో ఎక్కువగా కోర్సులు చేరుతున్నారు. మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, జూవాలజి, కెమిస్ర్టి, మైక్రొబయోలాజి, బయోకెమిస్ర్టి, జెనిటిక్స్‌, స్టాటస్టిక్స్‌ వంటి కోర్సుల్లో చేరుతున్నారు. ఇవేకాకుండా ఈ కోర్సులతో కలిపి అంప్యూటర్‌ అప్లికేషన్స్‌ ఉండేవిధంగా చూసుకుంటున్నారు. ఆర్ట్స్‌, కామర్స్‌ చదివిన విద్యార్థులు హైదరాబాద్‌లోని కళాశాలలో హానర్స్‌ డిగ్రీ కోర్సులు చేరుతున్నారు. కొంతమంది బీబీఎం, బీబీఏ కోర్సులతో పాటు ఇతర కోర్సుల్లో చేరుతున్నారు. మరికొంతమంది ఉపాధి ఇచ్చే హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులకు మరలుతున్నారు. వీరుకాక మిగిలిన వారు ఉమ్మడి జిల్లా పరిదిలోని డిగ్రీ పోస్టుల్లో చేరుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవే ట్‌ కళాశాలల్లో చేరుతున్నారు. ఎక్కువమంది ఇతర కోర్సులకు బయటకి వెళ్లడం వల్ల మిగిలిన వారు డిగ్రీలో చేరుతుండడంతో సీట్ల భర్తీ కావడంలేదు.

పలుచోట్ల క్రీడా స్థలాలు కరువే..

టీయూ పరిధిలోని చాలా కళాశాలల్లో వసతులు సక్రమంగా లేవు. విద్యార్థుల కు బోధించేందుకు కావాల్సిన ఏర్పాట్లు లేవు. ఎక్కువమంది విద్యార్థులు చేరిన తరగతి గదుల్లో మౌలిక వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. చాలా కళాశాలలకు ప్రభుత్వం మినహాయిస్తే మిగతా వాటికి క్రీడాస్థలాలు లేవు. ల్యాబ్‌లకు సంబంధించిన వసతులు లేవు. పూర్తిస్థాయిలో లేవు. చాలాకళాశాలల్లో టీచింగ్‌ ఫ్యాకల్టి కూడా అంతంతమాత్రంగానే ఉంది. ప్రతీ సంవత్సరం అడ్మిషన్‌లకు ముందు యూనివర్సీటి ఆడిట్‌సెల్‌ తనిఖీలు చేస్తున్నా.. అంతగా పట్టించుకోవడంలేదు. కాగా, డిగ్రీ కళాశాలల్లో దరఖాస్తులు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఉందని టీయూ దోస్త్‌ ఇంచార్జ్‌ ప్రొఫెసర్‌ సంపత్‌కుమార్‌ తెలిపారు. విద్యార్థులు ఈ నెల 6నుంచి వెబ్‌ ఆప్షన్‌లు ఇచ్చుకోవాలని ఆయన కోరారు. విద్యార్థులు ఎంపిక చేసుకున్న కళాశాలలో సీట్లు రాకపోతే 2వ విడతలో ఆప్షన్‌ లు ఇచ్చుకునేందుకు అవకాశం ఉందని ఆయన తెలిపారు. 


Updated Date - 2022-07-03T06:39:34+05:30 IST