ltrScrptTheme3

ఊర్లను బార్లుగా మార్చి.. మద్యం ఏరులు పారిస్తున్నారు: ఈటల

Oct 26 2021 @ 11:06AM

హనుమకొండ : హుజూరాబాద్ నియోజకవర్గంలోని కమలాపూర్‌లో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటల మాట్లాడుతూ.. హుజురాబాద్‌లో ప్రలోభాల పర్వం కొనసాగుతోందన్నారు. ఊర్లను బార్లుగా మార్చి, మద్యం ఏరులు పారిస్తున్నారన్నారు. ప్రభుత్వ, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారన్నారు. పౌరులు ఏ పార్టీలో ఉండాలో టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్ణయిస్తోందన్నారు. మేథావులు, పత్రికా, మీడియా యాజమాన్యాలు ఆలోచించాలన్నారు. తన మొహం కనిపించకుండా చేసేందుకు ఇప్పటికే ఐదువందల కోట్ల నల్లధనం ఖర్చు చేశారన్నారు. ఈ పరిణామాలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టని ఈటల పేర్కొన్నారు.


Follow Us on:

క్రైమ్ మరిన్ని...

అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.