Etela Rajender: అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు...

ABN , First Publish Date - 2022-09-19T03:00:36+05:30 IST

గుమ్మడిదలలో బీజేపీ సభ (Bjp Sabha) జరిగింది. ఈ సభకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Mla Etela Rajender) హాజరయ్యారు. పలు పార్టీలకు చెందిన నాయకులు బీజేపీలో..

Etela Rajender: అసైన్డ్ భూములు లాక్కుంటున్నారు...

సంగారెడ్డి (Sangareddy): గుమ్మడిదలలో బీజేపీ సభ (Bjp Sabha) జరిగింది. ఈ సభకు ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Mla Etela Rajender) హాజరయ్యారు.  ఈ సందర్భంగా ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం (Trs Government)లో గ్రామ గ్రామాన మెడికల్ షాపులు ఉండవని.. కానీ బెల్ట్ షాపులు మాత్రం ఉంటాయని మండిపడ్డారు. ఏటా 42వేల కోట్లు కేవలం ఒక్క మద్యం ద్వారానే ప్రభుత్వం సంపాదిస్తోందన్నారు. రైతుబంధుతో రియల్ వ్యాపారులకూ, ధనవంతులకు, భూస్వాములకు మాత్రమే లబ్ధి చేకూర్చిందని.. కౌలు దారులు నష్టపోయారని చెప్పారు. 


‘‘సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ..దళితులను తనవైపు తిప్పుకునే ప్రయత్నం మాత్రమే. ధరణితో 15 లక్షల ఎకరాల భూమిని రైతుల నుంచి కొల్లగొట్టిన ఘనత టీఆర్ఎస్‌దే.  దళితులకు మూడెకరాల భూమి ఇస్తానని చెప్పిన ముఖ్యమంత్రి కేసీఆర్... వారి నుంచి  అసైన్డ్ భూములను కూడా గుంజుకున్నారు. రింగ్ రోడ్డు చుట్టుపక్కల ఉన్న లక్షల ఎకరాలను ల్యాండ్ పూలింగ్ పేరుతో గుంజుకుని.. టీఆర్ఎస్ పార్టీ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోంది. టీఆర్ఎస్ ప్రభుత్వ అరాచకాలు, అన్యాయాలను అసెంబ్లీలో లేవనెత్తిన బీజేపి నేతలను అసెంబ్లీలోకి అడుగు పెట్టకుండా కుట్రపూరితంగా వ్యవహారించటం దుర్మార్గ చర్య. రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి.’’ అని ఈటల రాజేందర్ పిలుపు నిచ్చారు. 



Updated Date - 2022-09-19T03:00:36+05:30 IST