ఏటూరునాగారం-వరంగల్ మధ్య రాకపోకలు బంద్

Published: Wed, 27 Jul 2022 09:08:15 ISTfb-iconwhatsapp-icontwitter-icon

ములుగు: ఏటూరునాగారం-వరంగల్(Ethurunagaram-Warangal) మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. పస్రా-తాడ్వాయి మధ్య జనగలచవాగు పొంగి పొర్లుతుంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. జనగలచవాగు ఉధృతితో 163 నేషనల్ హైవే ప్రమాదకరంగా మారింది. ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు రాకపోకలను నిలిపివేశారు. వారం క్రితం కురిసిన వర్షాలకు పస్రా-తాడ్వాయి మధ్య ఉన్న 163 నేషనల్ హైవే(163 National Highway) కొట్టుకుపోయింది. ఇటీవలే దానికి  అధికారులు మరమ్మతులు చేసి పూర్తిచేశారు. ఇక మరోసారి జనగలచవాగు పొంగిపోర్లుతుండటంతో రాకపోకలు ఎక్కడికక్కడ నిలిచిపోయావి. దీంతో జనజీవనం స్తంభించిపోయింది.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.