ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ఈయూ గుడ్‌బై!

ABN , First Publish Date - 2021-05-10T10:41:41+05:30 IST

కొవిడ్‌ నివారణకు వినియోగించే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ ఆర్డర్‌ను రెన్యూవల్‌ చేసేది లేదని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) స్పష్టం చేసింది.

ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్‌కు ఈయూ గుడ్‌బై!

పారిస్: కొవిడ్‌ నివారణకు వినియోగించే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ ఆర్డర్‌ను రెన్యూవల్‌ చేసేది లేదని యూరోపియన్‌ యూనియన్‌(ఈయూ) స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనికాతో ఇప్పటికే కుదుర్చుకున్న కాంట్రాక్టు జూన్‌తో ముగుస్తుందని, తర్వాత ఫైజర్‌ వ్యాక్సిన్‌ను తెప్పించుకుంటామని ఈయూ తెలిపింది. డోసులను పంపించడంలో ఆలస్యం చేస్తున్న ఆస్ట్రాజెనికాపై 27 దేశాల ఉమ్మడి కూటమి ఈయూ గుర్రుగా ఉంది. ఫైజర్‌ వ్యాక్సిన్‌తో పోలిస్తే ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్‌ ధర తక్కువగా ఉన్నప్పటికీ సమయానికి అందించలేకపోవడంతో దానిపై ఈయూ చట్టపరమైన చర్యలకు ఉపక్రమించింది. 

Updated Date - 2021-05-10T10:41:41+05:30 IST