Ukraine అతిపెద్ద అణువిద్యుత్ ప్లాంట్‌పై రష్యా కాల్పులు...కర్మాగారం అగ్నికి ఆహుతి

ABN , First Publish Date - 2022-03-04T12:46:19+05:30 IST

ఉక్రెయిన్ దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై శుక్రవారం తెల్లవారుజామున రష్యా సైనికులు దాడి చేశారు....

Ukraine అతిపెద్ద అణువిద్యుత్ ప్లాంట్‌పై రష్యా కాల్పులు...కర్మాగారం అగ్నికి ఆహుతి

జపోరిజ్జియా(ఉక్రెయిన్): ఉక్రెయిన్ దేశంలోని అతిపెద్ద అణు విద్యుత్ కేంద్రంపై శుక్రవారం తెల్లవారుజామున రష్యా సైనికులు దాడి చేశారు.యూరప్ ఖండంలోనే అతి పెద్ద అణు కర్మాగారమైన జపోరిజ్జియాలో రష్యా సైనికులు అన్ని వైపుల నుంచి కాల్పులు జరిపారు. ఈ కాల్పులతో అణు విద్యుత్ ప్లాంట్ అగ్నికి ఆహుతైంది.అణు విద్యుత్ కేంద్రంలోనుంచి పొగలు రావడం గమనించానని సమీపంలోని ఎనర్‌గోదర్ నగర మేయర్ చెప్పారు.అణు కర్మాగారం యొక్క అన్ని వైపుల నుంచి రష్యా దాడులు ప్రారంభించిందని ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి డిమిట్రో కులేబా తెలిపారు.అణు కేంద్రం వద్ద ఉక్రెయిన్ బలగాలకు, రష్యన్ దళాలకు మధ్య తీవ్రమైన పోరాటం జరిగింది. అణు విద్యుత్ కేంద్రాన్ని పేల్చివేస్తే దాని వల్ల తీవ్ర ప్రమాదం జరుగుతుందని మంత్రి చెప్పారు. 


జపోరిజ్జియా అణువిద్యుత్ ప్లాంట్ పేలితే, దీని ప్రభావం చెర్నోబిల్ కంటే 10 రెట్లు అధికంగా ఉంటుందని  డిమిట్రో కులేబా చెప్పారు.దాడికి ముందు రష్యా దళాలు ప్లాంట్‌ను స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశాయని, ట్యాంకులతో పట్టణంలోకి ప్రవేశించాయని ఉక్రెయిన్ సైనికులు చెప్పారు. 


Updated Date - 2022-03-04T12:46:19+05:30 IST