రైల్వేస్టేషన్లలో ఈవీ చార్జింగ్‌

ABN , First Publish Date - 2022-06-02T11:18:55+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రధాన నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షించేందుకు దక్షిణ మధ్య రైల్వే(ఎ్‌ససీఆర్‌) చర్యలు చేపట్టింది. కర్బన

రైల్వేస్టేషన్లలో ఈవీ చార్జింగ్‌

- హైదరాబాద్‌లో ప్రారంభించిన ఎస్‌సీఆర్‌

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): ప్రధాన నగరాల్లో కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షించేందుకు దక్షిణ మధ్య రైల్వే(ఎ్‌ససీఆర్‌) చర్యలు చేపట్టింది. కర్బన ఉద్గారాలతో ఎదురయ్యే ఇబ్బందులను ప్రయాణికులకు తెలియజేయడంతోపాటు విద్యుత్‌ వాహనాలను(ఈవీ) వినియోగించే వారికి చార్జింగ్‌ స్టేషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. సికింద్రాబాద్‌ డివిజన్‌లోని 32 ప్రధాన స్టేషన్లలో కాంట్రాక్ట్‌ పద్ధతిన వీటిని నిర్వహిస్తున్నట్లు ఒక ప్రకటనలో ఎస్‌సీఆర్‌ వెల్లడించింది. హైదరాబాద్‌లోని నాంపల్లి రైల్వేస్టేషన్‌లో చార్జింగ్‌ స్టేషన్‌ను బుధవారం లాంఛనంగా ప్రారంభించారు. 2023 నాటికి ప్రధాన నగరాల్లో కాలుష్యాన్ని కనిష్ఠ స్థాయికి తగ్గించాలనే కేంద్ర ప్రభుత్వ లక్ష్యానికి అనుగుణంగా, ఈ-మొబిలిటీ బలోపేతానికి కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరించిన సికింద్రాబాద్‌ డివిజన్‌ అధికారులు, సిబ్బందిని ఎస్‌సీఆర్‌ ఇన్‌చార్జి జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌ అభినందించారు. ఈ-చార్జింగ్‌ స్టేషన్ల జాబితా చూస్తే.. హైదరాబాద్‌ (నాంపల్లి), బేగంపేట్‌, హైటెక్‌ సిటీ, వరంగల్‌, పర్లివైజ్‌నాథ్‌, ఖమ్మం, డోర్నకల్‌, తాండూరు, జమ్మికుంట, బీదర్‌, మంచిర్యాల, వికారాబాద్‌, చిత్తాపూర్‌, కాజీపేట, భద్రాచలం రోడ్‌, బెల్లంపల్లి, జనగాం, పెద్దపల్లి, కరీంనగర్‌, సిర్పూర్‌కాగజ్‌నగర్‌, మధిర, భువనగిరి, లాతూర్‌ రోడ్‌, బాల్కి, ఫతేనగర్‌, ఘట్‌కేసర్‌, లక్డీకపూల్‌, మహబూబాబాద్‌, నెక్లె్‌సరోడ్‌, సంజీవయ్యపార్కు, సేరం, జహీరాబాద్‌ స్టేషన్లు ఉన్నాయి.

Updated Date - 2022-06-02T11:18:55+05:30 IST