పంజాబ్‌లో EV తయారీ ప్లాంట్ * USD 25 మిలియన్లను వ్యయం చేయనున్న OSM

ABN , First Publish Date - 2022-06-26T23:38:02+05:30 IST

EV తయారీదారు Omega Seiki మొబిలిటీ... చండీగఢ్ సమీపంలో 25-మిలియన్ డాలర్ల పెట్టుబడితో అంతర్గత దహన ఇంజిన్(ICE) శక్తితో నడిచే వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలు(EVలు)గా మార్చేందుకుగాను రెట్రోఫిట్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది.

పంజాబ్‌లో EV తయారీ ప్లాంట్  * USD 25 మిలియన్లను వ్యయం చేయనున్న OSM


* ఇవ EVలుగా... ICE వాహనాలు

* డిసెంబరు త్రైమాసికం నాటికి సిద్ధం..! 

చండీగడ్ : EV తయారీదారు Omega Seiki మొబిలిటీ...  చండీగఢ్ సమీపంలో 25-మిలియన్ డాలర్ల పెట్టుబడితో అంతర్గత దహన ఇంజిన్(ICE) శక్తితో నడిచే వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలు(EVలు)గా మార్చేందుకుగాను రెట్రోఫిట్ సదుపాయాన్ని ఏర్పాటు చేస్తోంది. ఇది డిసెంబరు త్రైమాసికం నాటికి పని చేయవచ్చని భావిస్తున్నారు, కంపెనీ వ్యవస్థాపకుడు/చైర్మన్ ఉదయ్ నారంగ్ ఈ వివరాలను వెల్లడించారు. ‘ఫైనాన్సింగ్’ అన్నది EV కస్టమర్లకు సవాలుగా మిగిలిపోయినందున, ICE నుండి అటువంటి వాహనాలకు తరలించాలనుకునే వినియోగదారులకు, ప్రత్యేకించి... పెట్రోల్/డీజిల్ ధరలు చాలా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో...  రెట్రోఫిట్ ఈ వాహనాలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు నారంగ్ చెప్పారు.


ఆంగ్లియన్ ఒమేగా గ్రూప్‌లో భాగమైన ఫరీదాబాద్‌కు చెందిన కంపెనీ ప్రస్తుతం కార్గో, ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లు సహా చిన్న వాణిజ్య వాహనం M1KAని తయారు చేస్తోంది. అంతేకాకుండా... అధిక శ్రేణిలో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనంతో పాటు ట్రక్కులను ప్రారంభించే ప్రక్రియలో ఉంది. ‘ICE ఇంజిన్‌లు ఉన్న వాహనాలను ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ వాహనాలుగా మార్చే క్రమంలో మేము రెట్రోఫిట్ టెక్నాలజీ కోసం గ్లోబల్ ప్లేయర్‌తో టై-అప్ అయ్యాము. పంజాబ్‌లోని మొహాలీలో ఐదెకరాల స్థలంలో రెట్రోఫిట్ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం’ అని నారంగ్ వెల్లడించారు. రానున్న ఆరు నెలల్లో ఈ ప్రక్రియ అందుబాటులోకి వస్తుందని, ప్రారంభంలో చిన్న/తేలికపాటి వాణిజ్య వాహనాలను రెట్రోఫిట్ కోసం తీసుకుంటామని, ఆపై క్రమంగా బస్సులు సహా ఇతర వాహనాలను కూడా ఈ ప్రక్రియలో చేరుస్తామని చెప్పారు. కొత్త EVలతో పోల్చితే రెట్రోఫిట్ వాహనాలు EV ధరను గణనీయంగా తగ్గించనున్నట్లు చెబుతున్నారు. అంతేకాకుండా... EVని కొనుగోలు చేయాలనుకున్నప్పటికీ దాని ధర కారణంగా కొనుగోలు చేయని వినియోగదారులకు మంచి ఎంపికను అందజేస్తుందని నారంగ్ పేర్కొన్నారు. ఇటీవల పెరిగిన ఇంధన ధరలు, ముఖ్యంగా డీజిల్, ICEతో నడిచే వాణిజ్య వాహన ఆపరేటర్ల ఆదాయాలను ప్రతికూలంగా ప్రభావితం చేశాయని, EVలకు డిమాండ్ గణనీయంగా పెరిగిందని ఆయన పేర్కొన్నారు.

Updated Date - 2022-06-26T23:38:02+05:30 IST