‘బ్రిటిషర్లు కూడా రైతులను దేశద్రోహులు అనలేదు’

ABN , First Publish Date - 2021-02-28T22:13:21+05:30 IST

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో దేశాన్ని ముందుకు సాగిస్తున్న రైతులను బీజేపీ అవమానిస్తోందని, నిందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

‘బ్రిటిషర్లు కూడా రైతులను దేశద్రోహులు అనలేదు’

న్యూఢిల్లీ: భారతదేశ రైతులను దేశద్రోహులని బ్రిటిషర్లు కూడా అనలేదని, అలాంటిది భారతీయ జనతా పార్టీలు వారిని దేశద్రోహులుగా ముద్రవేసిందని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో నిర్వహించిన పబ్లిక్ ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఇందులో భాగంగా ఆయ మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో దేశాన్ని ముందుకు సాగిస్తున్న రైతులను బీజేపీ అవమానిస్తోందని, నిందిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


‘‘ఎర్రకోట విధ్వంసం పూర్తిగా బీజేపీ కుట్ర. ఎర్రకోటకు వస్తున్న రైతులను కావాలని తప్పుదారి పట్టించారు. ఈ దారిలో వెళ్లండి అంటూ కొన్ని మార్గాల వద్ద నిలబడి రైతులను దారి మళ్లించారు. వారి ఢిల్లీలో దారులు తెలియకపోవడం వల్ల వాళ్లు చెప్పినట్టే వెళ్లారు. అనంతరం బీజేపీ కార్యకర్తలే ఎర్రకోటపై జెండా ఎగురవేశారు. కానీ మోదీ ప్రభుత్వం రైతులను దోషులుగా నిలబెట్టే ప్రయత్నం చేస్తోంది. బ్రిటిషర్ల కంటే కూడా కిరాతకంగా బీజేపీ తయారైంది. రైతులను దేశద్రోహులని ఉగ్రవాదులని బ్రిటిషర్లు కూడా అనలేదు. కానీ బీజేపీ అంటోంది’’ అని కేజ్రీవాల్ మండిపడ్డారు.

Updated Date - 2021-02-28T22:13:21+05:30 IST