అరణియార్‌ నుంచి చుక్కనీరు కూడా వృథా కావొద్దు

ABN , First Publish Date - 2021-11-29T06:14:11+05:30 IST

అరణియార్‌ పర్యవేక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్‌ నుంచి చుక్కనీరు వృథా అయినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న హెచ్చరించారు.

అరణియార్‌ నుంచి చుక్కనీరు కూడా వృథా కావొద్దు
అరణియార్‌ ప్రాజెక్టు స్థితిగతులపై అధికారుల నుంచి ఆరా తీస్తున్న స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న

 స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న 

పిచ్చాటూరు, నవంబరు 28: అరణియార్‌ పర్యవేక్షణకు పటిష్ఠ చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్‌ నుంచి చుక్కనీరు వృథా అయినా సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా స్పెషల్‌ ఆఫీసర్‌ ప్రద్యుమ్న హెచ్చరించారు. ఆదివారం ఆయన ప్రాజెక్టు గేట్లను పరిశీలించి చెరువు కట్ట పటిష్ఠత, గేట్ల స్థితిగతులపై స్థానిక అధికారులను ఆరా తీశారు. అధికారులు అప్రమత్తంగా ఉంటూ ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా విధులు నిర్వహించాలన్నారు. రాత్రింబవళ్లు పని చేయాలని సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యం, ఇరిగేషన్‌ డీఈ రత్నారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - 2021-11-29T06:14:11+05:30 IST