బదిలీ చేసినా.. అక్కడే కొలువు!

ABN , First Publish Date - 2022-07-07T05:11:58+05:30 IST

మెప్మా విభాగంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగిని బదిలీ చేయగా.. మళ్లీ అదే స్థానంలో కొలువుదీరడం చర్చనీయాంశమవుతోంది. దీని వెనుక స్థానిక మంత్రి కార్యాలయంలో ఉన్న ఓ వ్యక్తి చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి.

బదిలీ చేసినా.. అక్కడే కొలువు!

మెప్మాలో ఉద్యోగి కొనసాగింపు
పలాస, జూలై 6 :
మెప్మా విభాగంలో పలు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఓ ఉద్యోగిని బదిలీ చేయగా.. మళ్లీ అదే స్థానంలో కొలువుదీరడం చర్చనీయాంశమవుతోంది. దీని వెనుక స్థానిక మంత్రి కార్యాలయంలో ఉన్న ఓ వ్యక్తి చక్రం తిప్పారనే విమర్శలు ఉన్నాయి. మెప్మాలో ఆ ఉద్యోగి మహిళా ఉద్యోగులపై అసభ్యంగా ప్రవర్తిస్తూ.. వేధింపులకు గురిచేస్తున్నారని ఆ శాఖ డైరెక్టర్‌తో పాటు మునిసిపల్‌ అధికారులకు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో ఆ శాఖ డైరెక్టర్‌ ఆయనను ఇక్కడి నుంచి బదిలీ చేశారు. ఆయన స్థానంలో శ్రీకాకుళంలో పనిచేస్తున్న మరో వ్యక్తికి ఇక్కడ గత నెల 30న పోస్టింగ్‌ ఇచ్చారు. ఆ రోజు సాయంత్రానికే సీన్‌ మారిపోయింది. బదిలీ జీవో స్థానంలో కొత్త జీవో విడుదల చేస్తు ఇక్కడ పనిచేసి ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తికే తిరిగి పోస్టింగ్‌ ఇచ్చారు. మంత్రి కార్యాలయంలో సలహాదారుడిగా ఉన్న ఓ వ్యక్తి చక్రం తిప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ వ్యక్తి తమకు వద్దని సాక్షాత్తు మంత్రి అప్పలరాజుతో పాటు చైర్మన్‌ బళ్ల గిరిబాబు సైతం లేఖలు ఇచ్చినా.. బుట్టదాఖలు కావడం విశేషం. ఈ వ్యవహారంపై మున్సిపల్‌ చైర్మన్‌ బళ్ల గిరిబాబను ఆ ఉద్యోగికి శ్రీకాకుళం బదిలీ జరిగినట్లు తనకు లేఖ అందిందని, సాయంత్రానికి మరో జీవో విడుదల చేస్తూ ఆయన్ను  కొనసాగిస్తున్నట్లు తెలిపారని అన్నారు. మెప్మా విభాగంలో ఏం జరుగుతుందో తనకు తెలియడం లేదని స్పష్టం చేశారు.

Updated Date - 2022-07-07T05:11:58+05:30 IST