భారత పీఎంగా ఎన్నారై..? అల్లహాబాద్ హై కోర్టులో పిటీషన్.. ఆర్పీ చట్టంపై సవాల్

ABN , First Publish Date - 2021-10-06T12:55:07+05:30 IST

భారత ప్రాతినిథ్య చట్టం 1950ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటీషన్‌పై వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను అల్లహాబాద్ మంగళవారం హై కోర్టు వివరణ..

భారత పీఎంగా ఎన్నారై..? అల్లహాబాద్ హై కోర్టులో పిటీషన్.. ఆర్పీ చట్టంపై సవాల్

అలహాబాద్: భారత ప్రాతినిథ్య చట్టం 1950ని సవాల్ చేస్తూ దాఖలైన ఓ పిటీషన్‌పై వివరణ కోరుతూ కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్‌ను అలహాబాద్ మంగళవారం హై కోర్టు వివరణ కోరింది. లోక్ ప్రహారి అనే ఎన్జీవో అల్లహాబాద్ హైకోర్టులో సంచలన  పిటీషన్ దాఖలు చేశారు. రాజ్యాంగంలోని భారత ప్రాతినిథ్య చట్టం(ఆర్పీ చట్టం) ప్రకారం దేశానికి ప్రధాని అర్హతపై ఆయన ప్రశ్నలు లేవనెత్తారు. శాశ్వతంగా ఎన్నారైలు కూడా దేశానికి ప్రధాని అయ్యే వీలు, రాష్ట్రాలకు ముఖ్యమంత్రులుగా బాధ్యతలు చేపట్టే అవకాశాన్ని ఈ చట్టం కల్పిస్తోందని కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. 


ఆర్పీ చట్టంలోని సెక్షన్ 19, సెక్షన్ 16(1) ప్రకారం భారత పౌరులు కాని వారికి కచ్చితంగా ఓటు హక్కు ఉండకూడదని తెలుస్తోంది. అయితే సెక్షన్ 20-A మాత్రం భారతదేశం బయట నివశించే ఎన్నారైలకు కొన్ని హక్కులను కల్పించింది. దీని ప్రకారం ఎవరైతే ఇతర దేశాల పౌరసత్వం పొందలేదో, చదువు, ఉద్యోగం.. ఇతర కారణాల వల్ల దేశాన్ని విడిచి వేరే దేశాల్లో తాత్కాలికంగా ఉంటారో వారికి ఓటు హక్కు ఇవ్వాలని నిర్ణయించింది. 


దీనిని అనుసరించే పిటిషనర్ ఎన్నారైలకు కూడా ప్రధాని లేదా సీఎం అయ్యే అవకాశం ఉందని కోర్టులో వాదనలు వినిపించారు. దీనికి ఉదాయహరణగా 15 ఏళ్ల క్రితం సుప్రీం కోర్టు తీర్పు చెప్పిన కుల్దీప్ నాయర్ వర్సెస్ భారత ప్రభుత్వం కేసును ప్రస్తావించారు. ఈ కేసు తీర్పులో కోర్టు ఏ రాష్ట్రానికైనా సీఎం కావాలంటే ఆ రాష్ట్రంలోనే నివశించాల్సిన అవసరం లేదని సుప్రీం ధర్మాసనం తీర్పు చెప్పిందని వివరించారు. అయితే దీనిపై హై కోర్టు స్పందిస్తూ.. అది రాష్ట్రాలకే పరిమితమని అంతకుమించి కాదని తెలిపింది. అలాగే దీనిపై వివరణ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని, ఎలక్షన్ కమిషన్‌ను వివరణ కోరింది. ఈ వివరణను ఈ నెల 18 లోగా అందించాలని ఆదేశించింది.

Updated Date - 2021-10-06T12:55:07+05:30 IST