రోజుకు ఇద్దరు ఆఫ్ఘన్ మహిళల ఆత్మహత్య.. కారణం ఇదే!

ABN , First Publish Date - 2022-07-02T22:35:02+05:30 IST

ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)లో ప్రతి రోజు కనీసం ఒకరిద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆప్ఘనిస్థాన్ పార్లమెంటు

రోజుకు ఇద్దరు ఆఫ్ఘన్ మహిళల ఆత్మహత్య.. కారణం ఇదే!

జెనీవా: ఆఫ్ఘనిస్థాన్‌ (Afghanistan)లో ప్రతి రోజు కనీసం ఒకరిద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఆప్ఘనిస్థాన్ పార్లమెంటు మాజీ డిప్యూటీ స్పీకర్ ఫాజియా కూఫీ(Fawzia Koofi)  తెలిపారు. అవకాశాలు లేకపోవడం, మానసిక అనారోగ్యం వంటివి మహిళల ప్రాణాలు తీసేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. జెనీవా (Geneva)లోని మానవ హక్కుల మండలి (HRC)లో మహిళల హక్కుల సమస్యపై అత్యవసర చర్చ సందర్భంగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది.


ఆఫ్ఘన్ మహిళలు దశాబ్దాలుగా తమ హక్కులు కోల్పోవడంతోపాటు తాలిబన్లు (Taliban) అధికారం చేజిక్కించుకున్నాక వారి పరిస్థితి మరింత దుర్భంగా మారింది. ఈ నేపథ్యంలో హెచ్ఆర్‌సీ అత్యవసరంగా మహిళలు, బాలికల హక్కులపై చర్చించింది.

  

ఈ సందర్భంగా ఫాజియా మాట్లాడుతూ.. దేశంలో ప్రతి రోజూ కనీసం ఒకరిద్దరు మహిళలు ఆత్మహత్య చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అవకాశాలు లేకపోవడం, మాసిక అనారోగ్య ఒత్తిడి వంటివి ఇందుకు కారణమవుతున్నాయని అన్నారు. 9 ఏళ్ల బాలికలను అమ్ముకుంటున్నారని, ఇందుకు ఆర్థిక ఒత్తిడి ఒక్కటే కారణం కాదని తమకు, తమ కుటుంబానికి భవిష్యత్తుపై ఎలాంటి ఆశ లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని అన్నారు. ఇది సాధారణ విషయం కాదని ఫాజియా ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-07-02T22:35:02+05:30 IST