ప్రతీ రైతూ పంట నమోదు చేయించుకోవాలి

Published: Fri, 19 Aug 2022 23:28:37 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రతీ రైతూ పంట నమోదు చేయించుకోవాలికొండాపురం మండలం రేగడిపల్లె గ్రామంలో పంట పొలాలనను పరిశీలిస్తున్న ఏఓ వెంకటకృష్ణారెడ్డి

కొండాపురం, ఆగస్టు 19: ప్రతీ రైతూ పంట నమోదును తప్పకుండా చేయించుకోవాలని ఇన్‌చార్జి ఏఓ వెంకటకృష్ణారెడ్డి తెలిపారు. మండలంలోని రేగడిపల్లె, బురుజుపల్లె, కోనవారిపల్లె గ్రామాలలో రైతులతో కలిసి పంట పొలాలను శుక్రవారం ఆయన పరిశీలించారు. గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బందిని కలిస్తే ఏ పంట సాగుచేశారో వారికి తెలియజేసి పంట పొలాలను పరిశీలించి సర్వేనెంబర్ల ఆధారంగా పంట నమోదు చేస్తామని ఏఓ తెలిపారు. పత్తి రైతులకు తెగుళ్ల నివారణకు  సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.