రూ.5 కోట్లతో ఇంటింటికీ కుళాయిలు

ABN , First Publish Date - 2021-10-17T05:30:00+05:30 IST

ఎటపాక మండలంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చేందుకు జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా రూ.5కోట్లతో ఇంటిం టికీ మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే నాగులాపల్లి ధన లక్ష్మి తెలిపారు.

రూ.5 కోట్లతో ఇంటింటికీ కుళాయిలు

  • ఎమ్మెల్యే నాగులాపల్లి ధనలక్ష్మి

ఎటపాక, అక్టోబరు17: ఎటపాక మండలంలో పలు గ్రామాల్లో తాగునీటి సమస్యను తీర్చేందుకు జలజీవన్‌ మిషన్‌ పథకం ద్వారా రూ.5కోట్లతో ఇంటిం టికీ మంచినీటి కుళాయిలను ఏర్పాటు చేస్తున్నట్టు ఎమ్మెల్యే నాగులాపల్లి ధన లక్ష్మి తెలిపారు. ఆదివారం ఎమ్మెల్యే ఎటపాక మండలంలోని మాధవరావుపేట, విస్సాపురం, నల్లకుంట, కాపుగొంపల్లి, గౌరిదేవిపేట, తోటపల్లి, పాండురంగా పురం, రాయనపేట, గుండాల గ్రామాల్లో జలజీవన్‌ మిషన్‌ పథకం పనులకు శంకుస్ధాపన చేశారు. ఎటపాక మండలంలో 4,800 ఇళ్లకు రూ.5కోట్ల 30 లక్షలతో కుళాయిలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు ఎమ్మె ల్యేకు వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. కార్యక్రమంలో మండల కన్వీనర్‌ తానికొండవాసు, జడ్పీటీసీ ఉబ్బా సుస్మిత, పసుపులేటి లక్ష్మణ్‌రావు, రంబాల నాగేశ్వరరావు, జి,సత్యప్రసాద్‌ (చిన్ని), ఆకుల రామారావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T05:30:00+05:30 IST