ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయాలి

ABN , First Publish Date - 2022-07-01T06:44:00+05:30 IST

పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేయాలనిమంత్రి చెల్లుబోయిన శ్రీని వాస వేణుగోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు.

ఇంటింటికి మంచినీటిని సరఫరా చేయాలి

రామచంద్రపురం, జూన్‌ 30: పట్టణంలో ప్రతి ఇంటికి మంచినీటిని సరఫరా చేయాలనిమంత్రి చెల్లుబోయిన శ్రీని వాస వేణుగోపాలకృష్ణ అధికారులను ఆదేశించారు. రామచం ద్రపురం మున్సిపల్‌ కౌన్సిల్‌ సాధారణ సమావేశం మున్సి పల్‌ కౌన్సిల్‌ హాల్‌లో గురువారం చైర్‌పర్సన్‌ గాధంశెట్టి శ్రీదేవి అధ్యక్షతన జరిగింది. ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా మంత్రి వేణు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా రామచం ద్రపురం పట్టణంలో అన్ని వార్డుల్లో మొదటి విడతలో మూడు వేల మొక్కలు నాటేందుకు నిర్ణయించామన్నారు.  కౌన్సిల్‌లో 16అంశాలతో కూడిన అజెండా ప్రవేశపెట్టగా, వివిధకారణాలతో వైఎస్సార్‌ క్లినిక్స్‌, మార్కెటింగ్‌కు సంబంఽ దించిన  10,12 అంశాలు వాయిదా పడ్డాయి. మిగిలిన 14 అంశాలను కౌన్సిల్‌ ఏకగ్రీవంగా ఆమోదించింది. పట్టణంలో  మెరుగైన వసతుల కల్పనకు చర్యలు చేపడతామని మంత్రి వేణు పేర్కొన్నారు. సమావేశంలో మున్సిపల్‌ వైస్‌ చైర్మన్లు చింతపల్లి నాగేశ్వరరావు, కోలమూరి శివాజి, మున్సిపల్‌ చీఫ్‌ విప్‌ వాడ్రేవు  సాయిప్రసాద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ కె.శ్రీకాం త్‌రెడ్డి, కౌన్సిల్‌ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.  



Updated Date - 2022-07-01T06:44:00+05:30 IST