ltrScrptTheme3

బాధ్యతలు తెలిసిన ప్రతి వ్యక్తీ పోలీసే : జీఆర్పీ ఎస్పీ

Oct 27 2021 @ 00:19AM
విద్యార్థులకు ఆయుధాల గురించి వివరిస్తున్న జీఆర్పీ ఎస్పీ అనిల్‌బాబు

గుంతకల్లు, అక్టోబరు 26: సామాజిక బాధ్యత కలిగిన ప్రతి వ్యక్తీ పో లీసే అవుతాడని జీఆర్పీ ఎస్పీ పీ అనిల్‌బాబు పేర్కొన్నారు. పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా స్థానిక జీఆర్పీ ఎస్పీ కార్యాలయంలో మం గళవారం ఓపెన హౌస్‌ నిర్వహించారు. పాఠశాలల విద్యార్థులకు వివిధ ర కాల పోలీసు ఆయుధాలను చూపి, పని విధానాలను తెలియజేశారు.  కార్యక్రమంలో జీఆర్పీ డీఎస్పీ రమణ, ఏఓ శ్రీనివాసరావు, ఆర్‌ఐ రామాంజనేయులు, ఎస్‌బీ ఎస్‌ఐ సురేశ, ఏఆర్‌ ఎస్‌ఐలు వెంకట రమణ, గోపి, ము స్తఫా, విజయభాస్కర్‌ పాల్గొన్నారు.


గుంతకల్లు టౌన: పోలీసుల సేవలు మరువలేనివని డీఎస్పీ నరసింగ ప్ప పేర్కొన్నారు. వనటౌన పోలీసు స్టేషనలో మంగళవారం పోలీసు అమరవీరుల వారోత్సవాల్లో భాగంగా ఓపెన హౌస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. పట్టణంలోని పలు పాఠశాలల విద్యార్థులకు ఆయుధాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వనటౌన సీఐ నాగశేఖర్‌, ఎస్‌ఐలు సురే ష్‌బాబు, కొండయ్య పాల్గొన్నారు.


తాడిపత్రి టౌన: పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని పట్టణ పోలీ్‌సస్టేషనలో మంగళవారం ఓపెనహౌ్‌స కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. విద్యార్థులకు స్టేషన విధులను చూపించారు. పరికరాలను వాడే విధానాన్ని వివరించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదు ప్రక్రియను క్లుప్తంగా విద్యార్థులకు తెలిపారు. విద్యార్థులు స్టేషనలో ఉన్న పరికరాలను ఆసక్తిగా తిలకించారు.


Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.