ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి

ABN , First Publish Date - 2022-08-17T04:17:09+05:30 IST

స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 22 వరకు నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు.

ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి
కాగజ్‌నగర్‌లో జాతీయ గీతాలాపన కార్యక్రమానికి హాజరైన పట్టణ వాసులు

- జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌

- జిల్లా వ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన

- పాల్గొన్న అధికారులు, ప్రజాప్రతినిధులు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 16: స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఈ నెల 22 వరకు నిర్వహించే ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌ అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌక్‌లో మంగళవారం నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమానికి అదనపు కలెక్టర్‌ రాజేశం, ఎమ్మెల్యే ఆత్రం సక్కు, జిల్లా ఎస్పీ సురేష్‌ కు మార్‌, డీఆర్‌వో సురేష్‌లతో కలిసి కలెక్టర్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

కాగజ్‌నగర్‌: పట్టణంలోని రాజీవ్‌గాంధీ చౌరస్తాలో నిర్వహించిన సామూహిక జాతీయ గీతాలాపన  కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడారు. సమర యోధుల ప్రాణ త్యాగల ఫలితమే స్వాతంత్య్రం వచ్చిందన్నారు. విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై జాతీయ గీతం ఆలపించారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ సద్దాం హుస్సేన్‌. జిల్లా అదనపు ఎస్పీ అశ్చేశ్వర్‌రావు, బీజేపీ నాయకులు డాక్టర్‌ హరీష్‌బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి కొంగ సత్యనారాయణ, తహసీల్దార్‌ ప్రమోద్‌, మున్సిపల్‌ కమిషనర్‌ అంజయ్య,  పట్టణ డీఎస్పీ కరుణాకర్‌, సీఐ రవీందర్‌, ఆర్మీ రిటైర్డ్‌ ఎంప్లాయీస్‌ సంఘం జిల్లా అధ్యక్షుడు నయాం తదితరులు పాల్గొన్నారు.  మండలంలోని చింతగూడలో జాతీయ గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌ ఛైర్మన్‌ కోనేరు కృష్ణారావు, ఎంపీపీ శంకర్‌, జిల్లా జడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు సిద్దిక్‌, నాయకులు, నజీర్‌ అలీ, లెండుగురే శ్యాంరావు, ఎంపీడీవో శ్రీనివాస్‌, ఎస్సై సోనియాతో పాటు  నాయకులు  వివిధ శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

కాగజ్‌నగర్‌ టౌన్‌: పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్‌ నరసింహం, లెక్చరర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. 

తిర్యాణి: మండలంలో సుమారు వెయ్యి మందితో జాతీయ గీతాన్ని ఆలపించారు. కార్యక్రమంలోప్రజాప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి: మండల కేంద్రంలోని శివాజీ చౌక్‌లో జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ నానయ్య, ఎస్సై విజయ్‌, ఎంపీడీఓ మహేందర్‌, నాయకులు వెంకయ్య, మహేష్‌, గ్రామస్తులు పాల్గొన్నారు. 

పెంచికలపేట: మండల కేంద్రంలో ఎస్సై రామన్‌కుమార్‌ ఆధ్వర్యంలో ప్రధాన వీధుల గుండా ర్యాలీ నిర్వహించిన అనంతరం జిల్లా పరిషత్‌ సెకండరీ పాఠశాల ఆవరణలో విద్యార్థులతో కలిసి సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ చంద్రమౌళి, సంజీవ్‌, రాజన్న, సుజాత, దేవాజీ పాల్గొన్నారు. 

దహెగాం:  మండల కేంద్రంలో ఎస్సై సనత్‌కుమార్‌ ఆధ్వర్యంలో అంగడి బజార్‌ ఏరియాలో జాతీయ గీతాన్ని ఆలపించారు. ఖర్జీ, దహెగాం పంట పొలాల్లో రైతులు వరినాట్లు వేస్తూ మహిళలు, ప్రజలు జాతీయ గీతాన్ని ఆలపించారు.  కార్యక్రమంలో తహసీల్దార్‌ రామ్మోహన్‌రావు, ఎంపీడీఓ రాజేశ్వర్‌గౌడ్‌, హెచ్‌ఎం విజయనిర్మల, ఎస్‌ఓ రమాదేవి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. 

బెజ్జూరు: మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో స్వాతంత్య్ర వజ్రోత్సవాలో భాగంగా జాతీయ గీతాలాపన నిర్వహించారు. ఆయా  కార్యక్రమాల్లో ఎస్సై వెంకటేష్‌, ఎంపీడీఓ రమేష్‌రెడ్డి, సర్పంచ్‌ శారద, ఎంపీటీసీ పర్వీన్‌ సుల్తానా, నాయకులు నరేందర్‌గౌడ్‌, జాహీద్‌ హుస్సెన్‌, మహేష్‌, బషరత్‌ఖాన్‌ తదితరులు పాల్గొన్నారు. 

లింగాపూర్‌: మండల కేంద్రంలో  జిల్లా అదనపు కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ హాజరై జాతీయ గీతం ఆలపించారు. కార్యక్రమంలో ఎంపీపీ సవిత, జడ్పీటీసీ రక్కబాయి, సర్పంచ్‌ ధర్మేందర్‌, సుమలత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 

కెరమెరి: మండల కేంద్రంలో సామూహిక గీతాలాపన కార్యక్రమం నిర్వహించారు.  కార్యక్రమంలో ఎంపీపీ మోతిరాం, జడ్పీటీసీ దృపతాబాయి, వైస్‌ ఎంపీపీ కలాం, సర్పంచ్‌ బయ్యనబాయి, ఎంపీటీసీ ఇఫ్తెకార్‌ అహ్మద్‌, ఎస్సై వెంకటేష్‌ పాల్గొన్నారు. 

సిర్పూర్‌(టి): మండల కేంద్రంలో ఎస్సై రవికుమార్‌ ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. కార్యక్రమంలో ఎంపీడీవో రాజేశ్వర్‌, తహసీల్దార్‌ రవీందర్‌, అటవీ శాఖాధికారు, ఎంపీఓ మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌ తఫీమా పర్వీన్‌, ఉప సర్పంచ్‌ మహేష్‌, న్యాయవాదులు శంకర్‌రావు, దయరాజ్‌సింగ్‌, కళ్యాణ్‌ పాల్గొన్నారు. 

కౌటాల: మండల కేంద్రంలో సీఐ బుద్దేస్వామి, ఎంపీపీ విశ్వనాథ్‌, తహసీల్దార్‌ రాంలాల్‌, ఎస్సై మనోహర్‌, ఎంపీవో సుధాకర్‌రెడ్డి, ఏపీవో పౌర్ణమి ఆధ్వర్యంలో సామూహిక జాతీయ గీతాలాపన నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ మౌనీష్‌, ఎంపీటీసీ మనీష్‌, ఉప సర్పంచ్‌ తిరుపతి తదితరులు పాల్గొన్నారు. 

వాంకిడి:  మండల కేంద్రంలో పోలీసుల ఆధ్వర్యంలో సాముహిక జాతీయ గీతా లాపన నిర్వహించారు.  కార్యక్రమానికి జిల్లా ఎస్పీ సురేష్‌ కుమార్‌  హాజరై మాట్లాడా రు. జిల్లాలో ఎక్కడ లేని విధంగా వాంకిడి  పో లీసుల ఆధ్వర్యంలో  2కు రన్‌, మహా భ్యారీ ర్యాలీ, సామూహిక జాతీ య గీతాలాపన కార్యక్రమాలు నిర్వహించడం అభినం దనీయమని వాంకిడి సీఐ శ్రీనివాస్‌, ఎస్సై డీకొండ రమేష్‌ను ఎస్పీ అభినందించారు. కార్యక్రమంలో ఎంపీపీ ముండె విమలాబాయి, డీఎస్పీ శ్రీనివాస్‌,  సీఐ శ్రీనివాస్‌, ఎస్సై డీకొండ రమేష్‌, ఎంపీడీవో వెంకటే శ్వర్‌రెడ్డి, తహసీల్దార్‌ మధుకర్‌,  ఎంఈవో మను కుమార్‌ పాల్గొన్నారు.    

Updated Date - 2022-08-17T04:17:09+05:30 IST