నీటిలో పడిన కాకిని ఈ ఎలుగుబంటి ఎలా కాపాడిందో చూస్తే.. మనుషుల కంటే జంతువులే నయం అంటారు..

ABN , First Publish Date - 2022-02-14T01:55:37+05:30 IST

అది ఓ జూపార్కులోని ఎలుగుబంటి ఉంటున్న ఎన్‌క్లోజర్‌. ఎలుగుబంటికి తాగునీటి సౌకర్యార్థం.. అక్కడ ఓ నీటి తొట్టిని ఏర్పాటు చేశారు. అయితే ఓ కాకి ప్రమాదవశాత్తు ఆ నీటిలో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. నీటి నుంచి..

నీటిలో పడిన కాకిని ఈ ఎలుగుబంటి ఎలా కాపాడిందో చూస్తే.. మనుషుల కంటే జంతువులే నయం అంటారు..

పేరుకే మనుషులు.. చాలా మందిలో మానవత్వం అనేది మచ్చుకైనా లేకుండా పోతోంది. సాటి మనిషికి సాయం చేద్దామన్న అలోచన పక్కన పెడితే.. కొంత మంది ఏకంగా ఎదుటి వారిని ప్రమాదంలోకి నెట్టాలని చూస్తుంటారు. ఇలాంటి మనుషులు ఉన్న ఈ కాలంలో చాలా జంతువులు పలు సందర్భాల్లో ‘‘మమ్మల్ని చూసి నేర్చుకోండి’’ అన్నట్లుగా... ఆశ్చర్యపోయేలా... ప్రవర్తిస్తుంటాయి. సాటి ప్రాణులకు సాయం చేసే జంతువుల వీడియోలను సోషల్ మీడియాలో చాలా చూశాం. ఇటీవల ఎలుగుబంటికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది.


అది ఓ జూపార్కులోని ఎలుగుబంటి ఉంటోన్న ఎన్‌క్లోజర్‌. ఎలుగుబంటికి తాగునీటి సౌకర్యార్థం.. అక్కడ ఓ నీటి తొట్టిని ఏర్పాటు చేశారు. అయితే ఓ కాకి ప్రమాదవశాత్తు ఆ నీటిలో పడి గిలగిలా కొట్టుకుంటూ ఉంటుంది. నీటి నుంచి బయటపడేందుకు విశ్వప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. అయితే అప్పుడే ఎలుగు బంటి ఆహారం కోసం అటుగా వెళ్తుంది. నీటిలో పడిన కాకిని గమనించి, తాను తినాలనే ఆలోచనను కూడా పక్కన పెడుతుంది. ముందుగా నీటి తొట్టె వద్దకు వెళ్లి, కాకిని నోటితో పట్టుకుని ఒడ్డున పెడుతుంది. దానికి ఎలాంటి గాయాలూ కాకుండా చాకచక్యంగా బయటకు తీస్తుంది. ‘‘హాయిగా ఎగిరిపో.. జాగ్రత్త మిత్రమా..’’ అన్నట్లుగా ఎక్స్‌ప్రెషన్ ఇచ్చి.. తన ఆహారం వద్దకు వెళ్తుంది. కొద్ది సేపటి తర్వాత కాకి తన కాళ్ల మీద తాను నిలబడుతుంది. కొందరు జూ సందర్శకులు ఈ ఘటనను మొత్తం వీడియో తీసి, సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ‘‘ఈ ఎలుగుబంటిది ఎంత మంచి మనసు’’ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

విమానం గాలిలో ఉండగా.. లోపలికి ఇదెలా వచ్చింది.. ‘అమ్మ బాబోయ్!’ అంటూ అవాక్కయిన ప్రయాణికులు





Updated Date - 2022-02-14T01:55:37+05:30 IST