ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే

ABN , First Publish Date - 2021-05-11T05:28:10+05:30 IST

ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే

ప్రభుత్వం దృష్టిలో అందరూ సమానమే
రంజాన్‌ తోఫాను అందజేస్తున్న ఎమ్మెల్యే అంజయ్యయాదవ్‌

కేశంపేట: ప్రభుత్వం దృష్టిలో ప్రజలందరూ సమానమేనని, ము స్లిం, హిందూ, క్రిస్టియన్‌ అనే మతాల తేడా ఉండదని షాద్‌నగర్‌ ఎ మ్మెల్యే అంజయ్యయాదవ్‌ అన్నారు. రంజాన్‌ సందర్భంగా సోమవారం మండల పరిధిలోని ఎక్లా్‌సఖాన్‌పేటలోని ఎమ్మెల్యే నివాసంలో ముస్లింలకు రంజాన్‌ తోఫాలు పంపిణీ చేశారు. కేశంపేట మండలానికి ప్రభు త్వం నుంచి 200 కానుకలు మంజూరైనట్లు ఎమ్మెల్యే తెలిపారు. హిందూ, మస్లిం, క్రిస్టియన్‌ పండుగులకు ఆయా వర్గాలకు రాష్ట్ర ప్రభుత్వం కానుకలు అందజేస్తోందని తెలిపారు. తహసీల్దార్‌ మురళీకృష్ణ, మండల కో-ఆప్షన్‌ సభ్యుడు జమాల్‌ఖాన్‌, తదితరులు పాల్గొన్నారు.


  • ఆమనగల్లులో షబ్‌-ఎ-ఖదర్‌ 


ఆమనగల్లు: రంజాన్‌ మాసం నేపథ్యంలో ఆమనగల్లు పట్టణంలోని అన్ని మజీద్‌లలో సోమవారం షబ్‌-ఎ-ఖదర్‌ వేడుకలు నిర్వహించారు. ముస్లింలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మాస్క్‌లు ధరించి, సామాజిక దూరం పాటించి మజీద్‌లలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. హైమదే హిలాల్‌ మజీద్‌లో ఇమామ్‌ ఆసిఫ్‌ అస్లాం రంజాన్‌, షబ్‌-ఎ-ఖదర్‌ ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం ఇమాం, మౌజమ్‌లను మజీద్‌ కమిటీ ఆధ్వర్యంలో సన్మానించారు. కార్యక్రమంలో మజీద్‌ కమి టీ అధ్యక్షుడు గౌస్‌మొయినుద్దీన్‌, సభ్యులు ఖలీల్‌, షర్ఫొద్దీన్‌, హైమద్‌, ఖుద్దూస్‌, రావుఫ్‌, రఫీ, రబ్బాని, కరీం, జలాల్‌ పాల్గొన్నారు.


  • రంజాన్‌ దుస్తుల పంపిణీ


మంచాల: రంజాన్‌ కానుకగా ముస్లింలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న దుస్తులను అందజేశారు. తహసీల్దార్‌ దేవ్‌జా ముస్లిం సోదరులతో సమావేశమై కానుకలను పంపిణీ చేశారు. పండుగను కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ నిర్వహించుకోవాని సూచించారు. కార్యక్రమంలో మండల కోఆప్షన్‌ సభ్యుడు ఎండీ.వాజీద్‌, జానీపాషా, జహంగిర్‌, అఫ్రోజ్‌, ఖాజా, యూసిఫ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-11T05:28:10+05:30 IST