Viral Video : అప్పటి వరకూ సిగ్గు పడిపోయిన పెళ్లికూతురు.. ఒక్కసారిగా అందరి ముందు ఇలా చేసిందేంటి..

Published: Sat, 26 Feb 2022 19:02:55 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Viral Video : అప్పటి వరకూ సిగ్గు పడిపోయిన పెళ్లికూతురు.. ఒక్కసారిగా అందరి ముందు ఇలా చేసిందేంటి..

పెళ్లి సమయంలో చాలా మంది యువతులు సిగ్గు, బిడియంతో ఉంటారు. కొందరైతే దించిన తల ఎత్తకుండా సిగ్గుపడుతూ ఉండడం చూస్తుంటాం. అయితే ప్రస్తుత సమాజంలో చాలా మంది యువతులు ఇందుకు పూర్తి విరుద్ధంగా ఉంటారు. మగవారి కంటే మేమేం తక్కువ అన్నట్లుగా అన్ని విషయాల్లోనూ పోటీ పడుతూ ఉంటారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియాలో చాలా వీడియోలు చూశాం. వివాహ సమయంలో పెళ్లి కుమార్తెలకు సంబంధించిన వీడియాలు అనేకం ఈ మధ్య వైరల్ అయ్యాయి కూడా. మొహమాటం లేకుండా పెళ్లి కుమారుడిని కూడా ఆట పట్టించేస్తున్నారు నవ వధువులు. అయితే, ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియో కూడా ఈ కోవకే చెందుతుంది. అప్పటి వరకూ సిగ్గు పడిపోయిన పెళ్లికూతురు.. ఒక్కసారిగా అందరి ముందు చేసిన పనికి.. అంతా పగలబడి నవ్వుకున్నారు.

ఒకప్పటి ఆడపిల్లలకు, ఇప్పటి ఆడపిల్లలకు చాలా తేడా ఉంది. నేటి మహిళలు అన్ని రంగాల్లోనూ మగవారితో సమానంగా దూసుకెళ్తున్నారు. పనులతో పాటూ ఆటపాటల్లోనూ తాము ఎవరికీ తగ్గమని చాటి చెబుతున్నారు. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఓ వీడియోలో పెళ్లికూతురు వేసిన జోష్‌ఫుల్ డ్యాన్స్ తెగ వైరల్ అవుతోంది. ఎక్కడ జరిగిందో ఏమో తెలీదు గానీ సదరు వీడియో మాత్రం నెట్టింట చక్కర్లు కొడుతోంది. వివాహ కార్యక్రమంలో వధూవరులు ఇద్దరూ పెళ్లి మండపంలో నిలబడి ఉంటారు. పక్కనే బ్యాండ్ మేళం మొదలవుతుంది. దీంతో అప్పటి వరకూ సైలెంట్‌గా ఉన్న వధువు.. ఒక్కసారిగా మారిపోతుంది. నోట్లో కరెన్సీ నోటు పెట్టుకుని మరీ బాంగ్రా డ్యాన్స్ చేస్తుంది. తర్వాత వరుడు కూడా ఆమెతో పాటూ కాలు కదుపుతాడు. తర్వాత వధువుపై వరుడు.. నోట్లను వెదజల్లుతాడు. ఈ వీడియోపై నెటిజన్లు ఫన్నీ ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.

వేగంగా వెళ్లి భార్యను ఆలింగనం చేసుకున్న భర్త.. ఆ వెంటనే తన ఛాతి మీద చేయి పెట్టుకున్నాడు.. తర్వాత ఊహించని విధంగా..



ఇవి కూడా చదవండిLatest News in Telugu

హిజ్రాకు లింగమార్పిడి చేసేందుకు బీఫార్మసీ విద్యార్థుల ఒప్పందం.. గది అద్దెకు తీసుకుని మరీ ఆపరేషన్.. చివరకు.. కూతురికి త్వరగా పెళ్లి జరిగేలా పూజలు చేయమంటే.. తల్లీ, కూతుళ్లకు నీళ్లిచ్చిన నకిలీ బాబా.. మరుక్షణమే..కాబోయే భర్తకు స్నేహితురాలితో కలిసి పరీక్ష పెట్టిన యువతి.. చివరకు భర్త చేసిన పనేంటో తెలుసుకుని ఖంగుతింది..Viral Video: ఇరుకైన సందులోకి వెళ్లేందుకు.. ఈ పాము ఏం చేసిందో మీరే చూడండి..videoనీ భార్య ఉరి వేసుకుందంటూ ఇంటి యజమాని ఫోన్.. ఆస్పత్రికి తీసుకెళ్లండి.. నేనొచ్చేస్తానన్న భర్త.. చివరకు షాకింగ్ ట్విస్ట్..!ఇదే నా అడ్రస్.. మీకు చేతనైతే పట్టుకోండి.. రూ.22 కోట్ల విలువైన కార్లను చోరీ చేసి.. పోలీసులకే ఓ దొంగ సవాల్
Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

ప్రత్యేకంLatest News in Teluguమరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.