అభివృద్ధికి అందరూ సహకరించాలి

Jun 17 2021 @ 00:14AM
భవన నిర్మాణానికి శంకుస్థాపన చేస్తున్న ఎమ్మెల్యే రఘునందన్‌రావు

చేగుంట, జూన్‌ 16: గ్రామాల అభివృద్ధికి ప్రతి ఒక్కరూ పార్టీలకతీతంగా సహకరించాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు పిలుపునిచ్చారు. చేగుంట మండలం వల్లభాపూర్‌ పంచాయతీ నూతన భవన నిర్మాణానికి ఎమ్మెల్యే రఘునందన్‌రావు బుధవారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామంలో అర్హులైనవారిని గుర్తించి డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను మంజూరు చేస్తానని పేర్కొన్నారు. కార్యక్రమంలో నార్సింగి మండల జడ్పీటీసీ కృష్ణారెడ్డి, ఎంపీటీసీ రవి, సర్పంచులు, అధికారులు పాల్గొన్నారు. 

Follow Us on: