ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలి : డీఎస్పీ

ABN , First Publish Date - 2021-03-03T07:06:52+05:30 IST

మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేం దుకు అందరూ సహకరించాలని తాడిపత్రి డీఎస్పీ చైతన్య పేర్కొన్నా రు.

ప్రశాంత ఎన్నికలకు అందరూ సహకరించాలి : డీఎస్పీ
గుత్తిలో మాట్లాడుతున్న డీఎస్పీ చైతన్య

గుత్తి,మార్చి2: మున్సిపల్‌ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేం దుకు అందరూ సహకరించాలని తాడిపత్రి డీఎస్పీ చైతన్య పేర్కొన్నా రు. స్థానిక పోలీసుస్టేషన ఆవరణలో మంగళవారం ఆయన కౌన్సిలర్‌ అభ్యర్థులతో సమావేశమై మాట్లాడారు. అల్లర్లకు పాల్పడితే కఠిన చ ర్యలు తీసుకుంటామన్నారు. ప్రచారంలో ఎన్నికల ప్రవర్తనా నియమావళి మేరకు నడుచుకోవాలన్నారు. కార్యక్రమంలో సీఐ రాము, ఎస్‌ఐ లు గోపాలుడు, మహబుబ్‌ బాషా, సిబ్బంది పాల్గొన్నారు.


రాయదుర్గం రూరల్‌ : మున్సిపల్‌ ఎన్నికల్లో ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించుకోవాలని ఎస్‌ఐ రాఘవేంద్ర పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం అంబేడ్కర్‌ నగర్‌, బీటీపీ రోడ్డు లే అవుట్‌లలో ఎన్నికల నిబంధనపై స్థానికులకు ఆయన అవగాహన క ల్పించారు. గొడవలతో జీవితాలను అంధకారం చేసుకోవద్దన్నారు. ఎ న్నికల నిబంధనలు ప్రతిఒక్కరు పాటించాలని, ఓటు హక్కును స్వే చ్ఛగా వినియోగించుకోవాలని కోరారు. కార్యక్రమంలో పోలీసు సిబ్బం ది, పట్టణ వాసులు పాల్గొన్నారు. 


ప్రధాన రహదారుల్లో పోలీసుల బైక్‌ ర్యాలీ 

తాడిపత్రి టౌన : మున్సిపల్‌ ఎన్నికల దృష్ట్యా డీఎస్పీ చైతన్య ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి పోలీసులు పట్టణంలోని ప్రధాన రహదారుల్లో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సీబీరోడ్డు, యల్లనూరు రోడ్డు, బ స్టాండ్‌, నంద్యాల రోడ్డు, అశోక్‌పిల్లర్‌, శ్రీనివాసపురం మెయినబజారు తదితర ప్రాంతాల్లో ర్యాలీ కొనసాగింది. ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటుహక్కు వినియోగించుకొనేలా భరోసా కల్పించేందుకు వజ్ర వాహనంతో పాటు పెద్దఎత్తున బైక్‌ ర్యాలీ నిర్వహించారు. అనంతరం పోరాటకాలనీ, టైలర్స్‌కాలనీ ప్రాంతాల్లో స్థానికులతో సీఐ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ ప్రదీ్‌పకుమార్‌ సమావేశమయ్యారు. ప్రజలు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదని, స్వేచ్ఛగా ఓటు వేసుకోవచ్చన్నారు.


Updated Date - 2021-03-03T07:06:52+05:30 IST