ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ABN , First Publish Date - 2022-07-01T06:00:50+05:30 IST

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి

ప్రతి ఒక్కరూ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి
ఘట్‌కేసర్‌ : కార్యక్రమంలో మాట్లాడుతున్న ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి

కులకచర్ల/ఘట్‌కేసర్‌/కొడంగల్‌ రూరల్‌, జూన్‌ 30 : ప్రతి ఒక్కరూఏ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలని ఎస్‌ఐ గిరి తెలిపారు. గురువారం కులకచర్ల మండలంలోని బొంరెడ్డిపల్లిలో ప్రతీ నెల మాదిరిగానే పౌర హక్కుల దినోత్సవం నిర్వహించగా ఆయన పాల్గొని మాట్లాడారు. గ్రామంలో ప్రజలు శాంతియుతంగా ఉండాలని, ప్రధానంగా కుల వివక్ష ఉండకూడదన్నారు. చట్టాలను అతిక్రమించి నేరాలకు పాల్పడితే చర్యలు తీసుకుంటామని తెలిపారు. బాల్యవివాహాల నిర్మూలన, యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని తెలిపారు. గిర్ధావర్‌ శ్రీనివాస్‌, గ్రామస్థులు పాల్గొన్నారు. అదేవిధంగా అట్టడుగు వర్గాల ప్రజల సమస్యల పరిష్కారం కోసమే ప్రతీ నెల పౌరహక్కుల దినోత్సవంను నిర్వహిస్తున్నట్లు ఘట్‌కేసర్‌ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఘట్‌కేసర్‌లోని అంబేద్కర్‌ భవన్‌లో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ, రాజ్యాంగ నిర్మాత  అంబేద్కర్‌  సూచించినట్లు కులాలు, మతాలు పక్కన బెట్టి అందరూ సోదరభావంతో, మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కృషి చేయాలన్నారు. స్ఫూర్తి ఆర్గనైజేషన్‌ నిర్వాహకుడు యాదగిరి అధికారులకు రాజ్యాంగం పుస్తకాలను అందజేశారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పావని జంగయ్య యాదవ్‌, వైస్‌ చైర్మన్‌ పల్గుల మాధవరెడ్డి, తహసీల్దార్‌ విజయలక్ష్మి, సిఐ చంద్రబాబు, కమిషనర్‌ వసంత, డీటీ భాస్కర్‌రెడ్డి, కౌన్సిలర్లు పద్మారావు, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు. కొడంగల్‌ మండల పరిధిలోని హస్నాబాద్‌లో పౌరహక్కులపై నిర్వహించిన సమావేశంలో ఎస్సై రవికుమార్‌, రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ బాల్య వివాహాలు, స్వేచ్ఛా, సమానత్వం, సమన్యాయం, చట్టాలు తదితర అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అధికారులు, సిబ్బంది, గ్రామస్థులున్నారు. 

Updated Date - 2022-07-01T06:00:50+05:30 IST