కొవిడ్‌-19పై అందరూ జాగ్రత్తగా ఉండాలి

ABN , First Publish Date - 2020-10-29T07:31:46+05:30 IST

కొవిడ్‌-19పై అందరూ జాగ్రత్తగా ఉండాలని అడిష నల్‌ డీఆర్‌డీవో సుధీర్‌ అన్నారు. మండల కేంద్రంలోని మండల సమాఖ్య కా ర్యాలయంలో బుధవారం కరోనాపై గ్రామసంఘాల సభ్యులకు అవగాహన స దస్సు నిర్వహించారు.

కొవిడ్‌-19పై అందరూ జాగ్రత్తగా ఉండాలి

తాడ్వాయి, అక్టోబరు 28: కొవిడ్‌-19పై అందరూ జాగ్రత్తగా ఉండాలని అడిష నల్‌ డీఆర్‌డీవో సుధీర్‌ అన్నారు.  మండల కేంద్రంలోని మండల సమాఖ్య కా ర్యాలయంలో బుధవారం కరోనాపై గ్రామసంఘాల సభ్యులకు అవగాహన స దస్సు నిర్వహించారు. చలికాలంలో ప్రతీ ఒక్కరూ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకో వాలని సూచించారు. ఒకరికొకరు దగ్గరగా ఉండకుండా ఆరుఅడుగుల దూరం లో ఉండి మాట్లాడుకోవాలన్నారు. బయటకు వెళ్లితే కచ్చితంగా మాస్క్‌ ధరించా లని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ రవి, ఏపీఎం రాజేందర్‌, వైద్యా ధికారి రవీందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


సదాశివనగర్‌: రాబోయే మూడు నెలలు ప్రజలు మరింత అప్రమత్తంగా ఉం డాలని మండల వైధ్యాధికారి ఇద్రిస్‌ఘోరి అన్నారు. బుధవారం మండలంలో నిర్వహించిన సమాఖ్య సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ శీతాకాలం లో కరోనా మరింత విజృంభించే అవకాశం ఉందని, ప్రజలు భౌతికదూరం పాటి స్తూ మాస్కులు తప్పకుండా ధరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఎన్‌ రాజారెడ్డి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ సవిత, శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.


బాన్సువాడ: పట్టణంలోని ఐకేపీ కార్యాలయంలో బుధవారం కరోనా వైరస్‌పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హెచ్‌ఈవో సాయిలు మాట్లాడుతూ కరోనా లక్షణాలు ఉంటే పరీక్షలు చేయించుకోవాలన్నారు. బతుకమ్మ, దసరా తదితర పండుగల నేపథ్యంలో ప్రతీ ఒక్కరికి కరోనా వైరస్‌ పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఈ సమావేశంలో ఐకేపీ, ఐసీడీఎస్‌, ఆరోగ్య సిబ్బంది తది తరులు పాల్గొన్నారు.  

Updated Date - 2020-10-29T07:31:46+05:30 IST