ప్రతీ ఒక్కరికీ ‘దళితబంధు’ ఇవ్వాలి

ABN , First Publish Date - 2022-06-25T06:54:29+05:30 IST

ప్రతీ దళిత కుటుంబానికి ‘దళితబంధు’ ఇవ్వాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

ప్రతీ ఒక్కరికీ ‘దళితబంధు’ ఇవ్వాలి
తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి తదితరులు

గరిడేపల్లి, జూన్‌ 24: ప్రతీ దళిత కుటుంబానికి ‘దళితబంధు’ ఇవ్వాలని కేవీపీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి కోట గోపి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యా లయం ఎదుట కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ‘దళితబంధు’ పథకం అందరికీ ఇవ్వని పక్షంలో కేవీపీఎస్‌ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ఆయన అన్నారు. అర్హు లైన దళితులందరికి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సీపీఎం మండల కమిటీ ఆధ్వర్యంలో మండలంలోని గ్రామాల్లో వారం రోజులు పర్యటించి  స్వీకరించిన ‘దళితబంధు’  దరఖాస్తులను తహసీల్దార్‌కు అందించారు.  కార్యక్రమంలో కేవీపీఎస్‌ జిల్లా అధ్యక్షుడు మర్రి నాగేశ్వర రావు, సీపీఎం మండల కమిటీ అధ్యక్షుడు షేక్‌ యాకుబ్‌ నాయకులు పటాన్‌ మైబెల్లి, నందిపాటి మట్టయ్య, హుస్సేన్‌, బిక్షం మహిళలు తదితరులు పాల్గొన్నారు.




Updated Date - 2022-06-25T06:54:29+05:30 IST