ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-05-11T06:04:23+05:30 IST

కరోనా వైరస్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకునేందుకు తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఎస్సై రమేష్‌ అన్నారు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

నార్నూర్‌, మే 10: కరోనా వైరస్‌ బారిన పడకుండా తమను తాము కాపాడుకునేందుకు తప్పకుండా వ్యాక్సిన్‌ తీసుకోవాలని ఎస్సై రమేష్‌ అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని పోలీసు స్టేషన్‌ ఆవరణలో వ్యాక్సిన్‌ రిజిస్ర్టేషన్‌పై అవగాహన కల్పించారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు నమ్మవద్దని ఆందోళనకు కావాల్సిన అవసరం లేదన్నారు. వ్యాక్సిన్‌ వేసుకునేవారు ఆరోగ్య సేతు యాప్‌ ద్వారా వివరాలు పొందుపరచి రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చనన్నారు. బయటకు వెళ్లేటప్పుడు మాస్క్‌ ధరించి, శానిటైజర్‌ వెంట ఉంచుకోవాలన్నారు. ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు పాటించి వైరస్‌ నివారణకు కృషి చేయాలన్నారు.

ఉట్నూర్‌రూరల్‌: ప్రతి ఒక్కరూ కరోన వైరస్‌ బారి నుంచి తమను తాము కాపాడుకోవడానికి వ్యాక్సిన్‌ నిర్భయంగా తీసుకోవాలని పీఆర్టీ యూ కుమ్రం భీం జిల్లా ప్రధాన కార్యదర్శి గడ్డం ప్రకాష్‌ అన్నారు. సోమవారం స్థానిక సీహెచ్‌సీలో డాక్టర్‌ ఆడే ఉపేందర్‌ నేతృత్వంలో వ్యాక్సిన్‌ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో నిరక్ష్యరాస్యులు అధికంగా ఉండడంతో అమాయక ప్రజలు వ్యాక్సిన్‌ తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారని, ఏజెన్సీ ప్రాంతాలలో పని చేస్తున్న ఉద్యోగులు ప్రజలను చైతన్య వంతులను చేసి ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకునేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిస్టర్‌ ఆత్రం చాంగుణ, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-05-11T06:04:23+05:30 IST