ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

ABN , First Publish Date - 2021-07-28T05:57:50+05:30 IST

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాల ని జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి జీవీఎల్‌ భరతలక్ష్మి అన్నా రు.

ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి
వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న అదనపు న్యాయమూర్తి

- జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి జీవీఎల్‌ భరతలక్ష్మి

కోల్‌సిటీ, జూలై 27: ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాల ని జిల్లా 6వ అదనపు న్యాయమూర్తి జీవీఎల్‌ భరతలక్ష్మి అన్నా రు. మంగళవారం గోదావరిఖని మున్సిఫ్‌కోర్టు కాంప్లెక్స్‌లో న్యా యవాదులకు, సిబ్బందికి, కుటుంబ సభ్యులకు బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వ్యాక్సిన్‌ కేంద్రాన్ని న్యాయమూర్తి ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వ్యాధికి వ్యాక్సిన్‌ శ్రీరామరక్ష అని, ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్‌ వేయించుకోవాలని, కొవిడ్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రతిఒక్కరూ నిత్యం అప్రమత్తంగా ఉంటూ భౌతిక దూరం, మాస్క్‌లు ధరించాలని, రోగ నిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి పౌష్టికాహారాన్ని తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో న్యాయమూర్తులు పర్వతపు రవి, టీఎస్‌వీ భార్గవి, జీఎస్‌ ఎల్‌ ప్రియాంక, బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అమరేందర్‌రావు, ప్రధాన కార్యదర్శి జవ్వాజి శ్రీనివాస్‌, ముష్కె రవి, ఇరికిళ్ల నర్సయ్య, భారతిచౌహాన్‌, ముచ్చకుర్తి కుమార్‌, ఎరుకల ప్రదీప్‌కుమార్‌, పద్మజ, వైద్యులు కృష్ణవేణి, భాగ్యలక్ష్మి, అనీత, స్వరూప, కృష్ణమూర్తి పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-28T05:57:50+05:30 IST