Advertisement

ప్రతీ ఒక్కరు కరోనా టీకా వేసుకోవాలి

Apr 23 2021 @ 01:19AM
సమావేశంలో మాట్లాడుతున్న జడ్పీ చైర్మన్‌ పుట్ట మధు

- జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

పెద్దపల్లి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి): కరోనా నివారణ కోసం జిల్లాలో ప్రతిఒక్కరు టీకాలు వేసుకోవాలని జడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ పి లుపునిచ్చారు. గురువారం జడ్పీ కార్యాలయం లో పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డితో కలిసి వైద్య, ఆరోగ్య శాఖాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో 45 సంవ త్సరాలు నిండిన వాళ్లు 2 లక్షల మందికి పైగా ఉండగా, ఇప్పటివరకు 50వేలమంది మాత్రమే టీకాలు వేసుకున్నారని, ఈనెల 22నుంచి నెలా ఖరు వరకు టీకాలు వేసేందుకు ఆసుపత్రుల ఆవరణలోనే గాకుండా గ్రామాలకు వెళ్లి ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించి టీకాలు వేస్తున్నామని అధి కారులు వివరించారు. దీంతో చైర్మన్‌ మాట్లాడు తూ టీకాలపై ప్రజల్లో నెలకొన్న అపోహలను తొలగించాలన్నారు. టీకాలపై విస్తృతంగా ప్రచా రం చేయాలన్నారు. ప్రజలు కూడా కరోనా టీ కాలు వేసుకుని తమకు తాము కరోనా బారి నుంచి కాపాడుకోవాలన్నారు. మే1వ తేదీనుంచి 18సంవత్సరాలు నిండిన వారందరికీ వ్యాక్సిన్‌ ఇవ్వనున్నారని, ఈలోపు 45ఏళ్లు నిండిన వారం తా వ్యాక్సిన్‌ వేసుకునే కేంద్రాలకు వెళ్లి టీకాలు వేసుకోవాలన్నారు. వ్యాక్సిన్‌ వేసే కేంద్రాల గు రించి గ్రామాల్లో ఒకరోజు ముందుగానే దండో రా వేయించాలన్నారు. కరోనా విషయమై ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వ్యాధి ల క్షణాలు కనిపిస్తే వెంటనే సమీపంలోగల ఆసు పత్రికి వెళ్లి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించు కోవాలన్నారు. కరోనా చికిత్స కోసం సుల్తానా బాద్‌, గోదావరిఖని ఆసుపత్రులతో పాటు సిం గరేణి ఆసుపత్రిలో 142 ఆక్సిజన్‌ బెడ్లు అందు బాటులో ఉన్నాయని, రెడ్‌మిసిపిర్‌ ఇంజక్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయని చైర్మన్‌ పుట్ట మధూకర్‌ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ ప్రమోద్‌ కు మార్‌, జడ్పీ సీఇఓ ఎం శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

Follow Us on:
Advertisement