ప్రతీ ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేయించుకోవాలి

Sep 17 2021 @ 23:05PM
వ్యాక్సిన్‌ పంపిణీని పరిశీలిస్తున్న సుధాకర్‌లాల్‌

- జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌


వెల్దండ, సెప్టెంబరు 17: ప్రతీ ఒక్కరు కొవిడ్‌ వ్యాక్సిన్‌ను వేయించుకోవాలని జిల్లా వైద్యాధికారి సుధాకర్‌లాల్‌ సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని చెర్కూర్‌ గ్రామంలో వైద్యాధికారులు నిర్వహిస్తున్న కొవిడ్‌ వ్యాక్సిన్‌ పంపిణీ కార్యక్రమాన్ని సుధాకర్‌లాల్‌ ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి వ్యాక్సిన్‌ ప్రాధాన్యంపై స్థానికులకు అవగాహన కల్పించారు. 18 ఏళ్లు నిండినవారు విధిగా వ్యాక్సిన్‌ వేయించుకుంటే కొవిడ్‌ను నియంత్రించగలుగుతామని అన్నారు. వందశాతం వ్యాక్సినేషన్‌ అమలు చేయాలని వైద్యసిబ్బందికి సూచించారు.  డిప్యూటీ వైద్యాధికారి బాబర్‌, డాక్టర్‌ తిలక్‌, వైద్యసిబ్బంది, ఆశ, అంగన్‌వాడీ సిబ్బంది ఉన్నారు.Follow Us on: