ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి: డీఎంహెచ్‌వో

ABN , First Publish Date - 2022-08-18T06:07:44+05:30 IST

ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ఆపదలో ఉన్నవారిని అదుకోవాలని జిల్లా వైద్యాధికారి కోటా చలం అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని, తిరుమలగిరి పీహెచ్‌సీలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లా డారు.

ప్రతిఒక్కరూ రక్తదానం చేయాలి: డీఎంహెచ్‌వో
తిరుమలగిరిలో రక్తదాతలకు సర్టిఫికెట్లు అందజేస్తున్న డీఎంహెచ్‌వో కోటా చలం

ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌, తుంగతుర్తి, ఆగస్టు 17: ప్రతి ఒక్కరూ రక్త దానం చేసి ఆపదలో ఉన్నవారిని అదుకోవాలని జిల్లా వైద్యాధికారి కోటా చలం అన్నారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా బుధవారం మండల కేంద్రంలోని  సామాజిక ఆరోగ్య కేంద్రంలో రక్తదాన శిబిరాన్ని,  తిరుమలగిరి పీహెచ్‌సీలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించి, మాట్లా డారు. రక్తదానం మరొకరికి ప్రాణదానమన్నారు. రక్తదానం చేసిన దాతలకు సర్టిఫి కెట్లు అందజేశారు.  కార్యక్రమంలో జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి వెంకట రమణ, ప్రభుత్వ వైద్యాధికారి నాగూనాయక్‌, ఏడీ రవిప్రసాద్‌, తహసీల్దార్‌ రాంప్ర సాద్‌, ఎంపీడీవో భీంసింగ్‌, ఎస్‌ఐ డానియేల్‌కూమార్‌, తిరుమలగిరి తహసీల్దార్‌ రమణారెడ్డి, ఎస్‌ శివకుమార్‌,  డాక్టర్‌ ప్రశాంత్‌బాబు, సీహెచ్‌వో  బిచ్చునాయక్‌, లయన్స్‌ క్లబ్‌ అధ్యక్షుడు జలగం రామచంద్రన్‌గౌడ్‌పాల్గొన్నారు.

- హుజూర్‌నగర్‌ ఏరియా ఆసుపత్రిలో ఆర్డీవో వెంకారెడ్డితో పాటు మరో 77 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో మునిసిపల్‌ వైస్‌ చైర్మన్‌ జక్కుల నాగే శ్వరరావు, డిప్యూటీ డీఎంహెచ్‌వో నిరంజన్‌, జిల్లా హాస్పటల్స్‌ కోఆర్డినేటర్‌ వెంక టేశ్వర్లు, డాక్టర్‌ కరుణ్‌, కమలాకర్‌, రూప్‌కుమార్‌, వైద్యాధికారి కిరణ్‌, ఇందిరాల రామకృష్ణ, గజగంటి ప్రభాకర్‌, ఉదయగిరి శ్రీను, సీఐ రామలింగారెడ్డి, తహసీల్దార్‌ జయశ్రీ పాల్గొన్నారు. 

- మేళ్లచెర్వు మండల కేంద్రంలోని సువర్ణ సిమెంట్‌ పరిశ్రమలో 23 మంది రక్తదానం చేశారు. కార్యక్రమంలో జనరల్‌ మేనేజర్‌ శ్రీనివాసరావు, డాక్టర్‌ ప్రేమ్‌సింగ్‌, ల్యాబ్‌ టెక్నీషియన్‌ శ్రవణ్‌కుమార్‌, నాగేందర్‌, జానీ, రమేష్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

-కోదాడ ప్రభుత్వ ఆసుప్రత్రిలో రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్‌ ప్రారంభించారు. అనంతరం బాలింతలకు పండ్లు పంపిణీతో పాటు కేసీఆర్‌ కిట్లు అందజేశారు. ఆస్పత్రి ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ వనపర్తి శిరీషాలక్ష్మీనారాయణ, డీఎస్పీ వెంకటేశ్వరరెడ్డి, సీఐ శివఽశంకర్‌ నాయక్‌, ఆర్డీవో కిషోర్‌కుమార్‌, జిల్లా అసంక్రమిత వ్యాధుల నివారణ అధికారి కల్యాణ్‌చక్రవర్తి, మునిసిపల్‌ కమిషనర్‌ మహేశ్వర్‌రెడ్డి, కోదాడ ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రజని, వైద్యులు సురేష్‌, లక్ష్మీప్రసన్న పాల్గొన్నారు. 



Updated Date - 2022-08-18T06:07:44+05:30 IST