ప్రతిఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలి

Published: Sun, 27 Mar 2022 23:29:19 ISTfb-iconwhatsapp-icontwitter-icon
ప్రతిఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలికొడంగల్‌ : తిరుమంజన పూజల్లో అర్చకులు, ధర్మకర్తలు

ఘట్‌కేసర్‌ రూరల్‌/కీసర/పరిగి రూరల్‌/కొడంగల్‌ రూరల్‌/కొడంగల్‌, మార్చి 27 : ప్రతిఒక్కరూ భక్తిభావం కలిగి ఉండాలని పలువురు ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఆదివారం పలు ఆలయాల్లో నిర్వహించిన వివిధ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా పూజారులు తీర్థప్రసాదాలు అందజేశారు. భక్తులు పెద్దఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. ఈ మేరకు ఘట్‌కేసర్‌ మండల పరిధిలోని ప్రతా్‌పసింగారంలో శ్రీమల్లికార్జునస్వామి కల్యాణం వైభవంగా జరిగింది. ఒగ్గు కళాకారులు స్వామి, అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించి పట్టువస్త్రాలు సమర్పించారు. యాదవసంఘం ఆధ్వర్యంలో స్వామివారి కల్యాణ మహోత్సవం నిర్వహించారు. కాగా, ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి కల్యాణం చరిత్రను పూజారులు భక్తులకు వివరించారు. మహిళలు అమ్మవారికి ఒడిబియ్యం, తలంబ్రాలు సమర్పించారు. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ శరత్‌చంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డిలు స్వామివారికి కట్నకానుకలు సమర్పించారు. అనంతరం భక్తులకు అన్నదానం జరిపించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్‌ శివశంకర్‌, ఉపసర్పంచ్‌ అబేదాబేగం, వార్డుసభ్యులు, యాదవసంఘం నాయకులు కాసం శ్రీశైలంయాదవ్‌, అందే అయిలే్‌షయాదవ్‌, ఆంజనేయులు, సంతో్‌షకుమార్‌, లక్ష్మణ్‌యాదవ్‌, శ్రీరాములు, అయిలయ్య, శ్రీధర్‌, మహిళలున్నారు. 

పెద్దమ్మ తల్లికి బోనాలు 

ముదిరాజ్‌ల కులదైవం శ్రీ పెద్దమ్మ తల్లికి కీసరలో ఘనంగా బోనాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి నేవేద్యం సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. బోనాల ఉత్సవాల సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు అమ్మవారి కల్యాణం వైభవంగా నిర్వహించారు. 

  • అంబాభవానికి పూజలు

ప్రతిఒక్కరూ దైవభక్తి కలిగి ఉండాలని పరిగి మున్సిపల్‌ చైర్మన్‌ ముకుందా అశోక్‌కుమార్‌ పేర్కొన్నారు. పరిగి మండల పరిధిలోని కాళ్లాపూర్‌ లొంక హనుమాన్‌ దేవాలయాన్ని ఆయన సందర్శించారు. స్థానిక నాయకులతో కలిసి అంబాభవాని మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ బొంపల్లి ఉమాదేవి, నజిరాబాద్‌ సర్పంచ్‌ గణేష్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ మహేందర్‌, తదితరులున్నారు.

ఘనంగా బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన

కొడంగల్‌ మండల పరిధిలోని నాగారం గ్రామంలో బొడ్రాయి పునఃప్రతిష్ఠాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామస్తులు జగదీశ్‌, రాజశేఖర్‌ల ఆధ్వర్యంలో హోమం, జలాభిషేకం నిర్వహించి, పూజారుల సమక్షంలో బొడ్రాయిని ప్రతిష్ఠించారు. అన్నదానం ఏర్పాటు చేశారు.

  • వేంకటేశ్వరాలయంలో ఆల్వార్‌ తిరుమంజనం

కొడంగల్‌ పట్టణంలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా ఆదివారం కోవిల్‌ ఆల్వార్‌ తిరుమంజనం నిర్వహించారు. సుగంధ ద్రవ్యాలు, కుంకుమ, పసుపు, చందనం, కర్పూరం ద్రవ్యాలతో ఆలయాన్ని శుద్ధి చేశారు. తిరుమల బ్రహ్మోత్సవాల తరహాలో కొడంగల్‌ వేంకటేశ్వరాలయంలోనూ పూజలు నిర్వహిస్తారు. సోమవారం సాయంత్రం తిరుచ్చి ఉత్సవంతో బస్టాండ్‌ సమీపంలోని పార్వేట మండపంలో అంకురార్పణ పూజలు నిర్వహిస్తామని ధర్మకర్తలు తెలిపారు.

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.