అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషి చేయాలి

Dec 6 2021 @ 22:49PM
అంబేద్కర్‌ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న జడ్పీ వైస్‌చైర్మెన్‌ కోనేరు క్రిష్ణారావు

- జడ్పీ వైస్‌చైర్మన్‌ కోనేరు క్రిష్ణారావు 

కాగజ్‌నగర్‌ టౌన్‌, డిసెంబరు 6: అంబేద్కర్‌ ఆశయ సాధనకు ప్రతిఒక్కరూ కృషిచేయాలని జడ్పీవైస్‌చైర్మెన్‌ కోనేరు క్రిష్ణారావు అన్నారు. సోమవారం అంబేద్కర్‌ 65వవర్ధంతిని పురస్కరించుకొని పట్టణంలో పలుచోట్ల ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. స్వేచ్ఛ, సమానత్వంతో పాటు అనేక విషయాలపై ప్రజలను మేల్కొల్పిన మేధావి అంబేద్కర్‌ అన్నారు. అలాగే అంబేద్కర్‌ విగ్రహానికి అంబేద్కర్‌ మెమోరియల్‌ అసోషియేషన్‌ ఆధ్వర్యంలో, బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యుడు డాక్టర్‌ కొత్తపల్లిశ్రీనివాస్‌ ఆధ్వర్యంలో పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాగజ్‌నగర్‌దీక్షభూమి వద్ద పీఆర్టీయూ టీఎస్‌నాయకులు పూల మాలలు వేశారు. కార్యక్రమంలో అంబేద్కర్‌ మెమోరియల్‌ అసోషియేషన్‌ అధ్యక్షుడు రాంటెంకి లక్ష్మణ్‌, రిటైర్డ్‌ తహసీల్దార్‌ సుభాష్‌, పీఆర్టీయూటీఎస్‌ సంఘం నాయకులు ఏటుకూరి శ్రీనివాస్‌రావు, గడ్డం భిక్షపతి తదితరులు పాల్గొన్నారు.

ఆసిఫాబాద్‌:పట్టణంలో అంబేద్కర్‌ వర్ధంతిని ఆయాసంఘాలు, పార్టీలఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు. ఎంపీడీవో కార్యాలయంలో జడ్పీటీసీ అరి గెల నాగేశ్వర్‌రావు, ఎంపీపీ మల్లిఖార్జున్‌ యాదవ్‌ అం బేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు. కోర్టుఆవరణలో బార్‌అసోసియేషన్‌ ఆధ్వర్యంలో న్యాయవాదులు, బీఎస్పీ కార్యాలయంలో బీఎస్పీ నాయకులు వర్ధంతిని నిర్వహించారు.

బెజ్జూరు: మండలకేంద్రంలో అంబేద్కర్‌ సొసైటీ ఆధ్వర్యంలో అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పంచశీల జెండాను ఆవిష్కరించారు. నాయకులు పెంటయ్య, రాజన్న, శంకర్‌, పోశన్న తదితరులు పాల్గొన్నారు. 

లింగాపూర్‌: మండల కేంద్రంలో ఎంపీపీ సవిత అంబేద్కర్‌ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. నాయకులుఆత్మారాం,అనీల్‌, ప్రేంకుమార్‌, సర్పంచ్‌లు కిషన్‌, దేవిత్‌ పాల్గొన్నారు. 

చింతలమానేపల్లి: మండలకేంద్రంలో అంబేద్కర్‌ చిత్రపటానికి ఎంపీపీనానయ్య పూలమాలవేసి నివాళు లర్పించారు. ఎంపీటీసీ సుశీల, కోఆప్షన్‌ సభ్యులు నాజీంహుస్సేన్‌, ఏపీఓ రాజన్న పాల్గొన్నారు. 

కెరమెరి: మండలకేంద్రంలో ఆదివాసీ విద్యార్థి సం ఘం మండలాధ్యక్షుడు తుకారాం నెహ్రునగర్‌లో అంబే ద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పిం చారు.నాయకులు తిరుపతి, రాజే శ్వర్‌, వేణు, అర్జున్‌, జ్యోతిరాం, శంకర్‌ పాల్గొన్నారు. 

సిర్పూర్‌(టి): మండలంలోని డోర్‌పల్లి గ్రామంలో ఎంపీపీ సువర్ణ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించా రు. మండల కేంద్రంలోని అంబే ద్కర్‌ విగ్రహానికి అన్నిరాజకీయ పార్టీలనాయకులుపూల మాలలు వేసి నివాళులు అర్పించారు.

వాంకిడి:సోమవారం ప్రభుత్వ జూనియర్‌ కళాశాలతో పాటు మండలంలోని ఖమాన, కనర్‌గాం, వాంకిడి, బెండార, ఇంధాని, ఖిరిడి, తదితర గ్రామాల్లో అంబేద్కర్‌ విగ్రహానికి, చిత్రపటాలకు పూల మాలలువేసి నివాళులు అర్పించారు. మండల కేంద్రం లోని జేత్‌వాన్‌ బుద్ధవిహార్‌లో దళితసంఘ నాయకులు పంచశీల్‌ పతాకాన్ని అవిష్కరించి ప్రత్యేకపూజలు చేశారు. నాయకులు ఉప్రె జైరాం, దుర్గం అన్నారావు, పెరుగు అశోక్‌, విలాస్‌, రోషన్‌, విజయ్‌ఉప్రె, సందీప్‌ దుర్గె, పాండు జాడె పాల్గొన్నారు.

సిర్పూర్‌(యూ): మండల కేంద్రంలో గాంధీచౌక్‌లో అంబేద్కర్‌ విగ్రహానికి మార్కెట్‌ కమిటీచైర్మన్‌ ఆత్రం భగవంతరావు, సర్పంచులు మెస్రం భూపతి, వీణ, రాయిసెంటర్‌ సర్‌మేడి ఆత్రంఆనందరావు తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

జైనూరు: మండల కేంద్రంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్‌ కనకయాదవ్‌రావ్‌, సర్పంచ్‌ మేస్రం పార్వతీబాయి, టీఆర్‌ఎస్‌సీనియర్‌ నాయకుడు మేస్రం అంబాజీ, జిల్లా దళిత నాయకుడు కాంబ్లే దయానంద్‌ తదితరులు అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. కాంబ్లే అన్నారావ్‌, భుతాలె వెంకటేష్‌, కాంబ్లే అశోక్‌ తదితరులు ఉన్నారు.

దహెగాం: మండలంలోని బీబ్రా, ఐనం, దహెగాం గ్రామాల్లో అంబేద్కర్‌ వర్ధంతి సందర్భంగా పంచశీల జెండాలను ఆవిష్కరించి అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. 

కౌటాల: మండలంలోని ముత్తంపేట గ్రామంలో డాక్టర్‌ విద్యాసాగర్‌, మేనేజర్‌ అజయ్‌కుమార్‌ గేరాలు అంబేద్కర్‌ చిత్రపటానికి పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. సర్పంచ్‌ శ్రీనివాస్‌, ఉప సర్పంచ్‌ వెంకటేష్‌, ఎంపీటీసీ సురేఖ, వసంత్‌రావు, నాందేవ్‌, బండురావు, తదితరులు పాల్గొన్నారు.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.