ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి : ఎస్‌ఐ

ABN , First Publish Date - 2022-01-24T05:11:26+05:30 IST

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి : ఎస్‌ఐ

ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలి : ఎస్‌ఐ

బషీరాబాద్‌/కులకచర్ల/ఘట్‌కేసర్‌ రూరల్‌, జనవరి 23: కరోనా మహమ్మారి కట్టడికి ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని బషీరాబాద్‌ ఎస్‌ఐ విద్యాచరణ్‌రెడ్డి సూచించారు. బషీరాబాద్‌ మండల కేంద్రంతోపాటు గ్రామాల్లోని వివిధ రహదారుల్లో సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేశారు. మాస్క్‌ లేకుండా వాహనాలు నడుపుతున్న వారికి మాస్క్‌, హెల్మెట్‌ వాడకంతో కలిగే ప్రయోజనాలను వివరించారు. మాస్క్‌ వాడకుంటే రూ.1000 జరిమానా కట్టవాల్సివస్తుందని పలువురిని హెచ్చరించి పంపించారు. కులకచర్ల మండల పరిధిలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీహెచ్‌వో చంద్రప్రకాశ్‌ తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని కుస్మసముద్రం గ్రామంలో పాజిటివ్‌ నిర్ధారణ అయిన కుటుంబ సభ్యులతో ఆయన మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని కాచవానిసింగారం సర్పంచ్‌ వెంకట్‌రెడ్డి గ్రామస్తులకు సూచించారు. గ్రామపంచాయతీ ఆవరణలో సామాజిక కార్యకర్తలు సీహెచ్‌ భరత్‌రెడ్డి, నవీన్‌రామిరెడ్డిల సౌజన్యంతో ఉచితంగా కరోనా పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఈ అవకాశాన్ని గ్రామస్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

Updated Date - 2022-01-24T05:11:26+05:30 IST