ఆదివాసీల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి

ABN , First Publish Date - 2022-08-10T03:46:38+05:30 IST

ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ఐక్యతతో కృషి చేయాలని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి నీలిమ పేర్కొన్నారు. మంగళవారం ప్రపం చ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐబీ చౌరస్తాలో గుస్సాడి, ఽధింసా నృత్యా లు, నగారా మోతలతో సందడి చేశారు. ఐబీ చౌరస్తా నుంచి బైపాస్‌రోడ్డులో గల హరిత ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ ఆదివా సీలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు.

ఆదివాసీల హక్కుల పరిరక్షణకు అందరూ కృషి చేయాలి
సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా గిరిజనాభివృద్ది అధికారి నీలిమ

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 9: ఆదివాసీల హక్కుల పరిరక్షణకు ఐక్యతతో కృషి చేయాలని జిల్లా గిరిజనాభివృద్ధి అధికారి నీలిమ పేర్కొన్నారు. మంగళవారం ప్రపం చ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐబీ చౌరస్తాలో గుస్సాడి, ఽధింసా నృత్యా లు, నగారా మోతలతో సందడి చేశారు. ఐబీ చౌరస్తా నుంచి బైపాస్‌రోడ్డులో గల హరిత ఫంక్షన్‌ హాల్‌ వరకు ర్యాలీ నిర్వహించారు. డీటీడీవో మాట్లాడుతూ ఆదివా సీలు సామాజికంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలన్నారు. దేశ స్వాతంత్రోద్యమంలో ఆదివాసీల పోరాటాలు  చిరస్మరణీయమన్నారు. ఆదివాసీ సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మడావి వెంకటేష్‌,  నైతం లక్ష్మణ్‌, జంగులు మాట్లాడుతూ ఆదివాసీల చట్టాలను విస్మరించి అభివృద్ధి పేరుతో విధ్వంసం కొనసాగిస్తున్న తీరు విచారకరమ న్నారు.  సింగరేణి గనులు, టైగర్‌జోన్‌, సామాజిక అడవులు, భూ సేకరణ చట్టాల పేరిట ఆదివాసీలను అటవీ ప్రాంతం నుంచి గెంటివేసేందుకు పాలకులు కుట్ర పన్నుతున్నారని  విమర్శించారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని, అటవీ అధికారుల దౌర్జన్యాలను నియంత్రించాలన్నారు. జిల్లా కేంద్రంలో ఆదివాసీ భవన్‌ నిర్మాణానికి, కుమరంభీం విగ్రహానికి స్థలం కేటాయించాలన్నారు. 1/70 స్వయం పాలన కోసం, పీసా చట్టాన్ని, అటవీ హక్కుల చట్టాలను అమలు చేయాలన్నారు. ఆదివాసీ హక్కుల పోరాట సంఘం, తుడుం  దెబ్బ నాయకులు పెందూర్‌ హన్మంత్‌, వెడ్మ కిషన్‌, గంజి రాజన్న, రవి, మేస్రం వసంత్‌, మడావి శంకర్‌,  పాల్గొన్నారు.  

చెన్నూరు: ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని సందర్భంగా కుమరంభీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం జెండాను ఆవిష్కరించారు. ఆది వాసీ ఉద్యోగ సంఘం నాయకులు రాములు, తలండి శంకర్‌లు మాట్లాడుతూ ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించకపోవడం సిగ్గు చేటన్నారు. మల్లయ్య, మాంతయ్య, వెంకటేష్‌, బాపు, మధుకర్‌ పాల్గొన్నారు. 

తాండూర్‌: మండలంలోని పలు గ్రామాల నుంచి ఆదివాసీలు మండల కేంద్రానికి తరలివచ్చారు. ఐబీలో భారీ ర్యాలీ నిర్వహించి ఆదివాసీ జెండాను ఆవిష్కరించారు.  తుడుందెబ్బ, ఆదివాసీ, కొలవార్‌ సంఘాల నాయకులు పాల్గొన్నారు. 

దండేపల్లి: ఆదివాసీ దినోత్సవం సందర్భంగా పలు గ్రామాల ఆదివాసీలు దండేపల్లికి తరలివచ్చారు. డోలు వాయ్యిదాలతో బస్టాండ్‌ నుంచి అంబేద్కర్‌ విగ్రహం వర కు ఊరేగింపు నిర్వహించి గాంధీ, జయశంకర్‌, అంబేద్కర్‌, తెలంగాణ తల్లి విగ్రహాల కు పూలమాలలు వేశారు. అంగడిబజారు, గిరిజన గూడాల్లో జెండాలను ఎగురవే శారు. ఆదివాసి సేన రాష్ట్ర అధ్యక్షుడు కోవ దౌలత్‌రావు, గోండ్వాన రాయిసెంటర్‌ జిల్లా అధ్యక్షుడు పెంద్రం రాముపటేల్‌లు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల సాధన కు ఉద్యమించాలన్నారు. ఎంపీపీ గడ్డం శ్రీనివాస్‌, సర్పంచులు చంద్రకళ, రాజేశ్వరీ, విఠల్‌, లచ్చుపటేల్‌, భీం, ఆడాయి కాంతరావు, కనక జంగు, జలపతి పాల్గొన్నారు.  

Updated Date - 2022-08-10T03:46:38+05:30 IST