ఆసుపత్రిలో అంతా నిద్రపోయాక అర్ధరాత్రి సమయంలో టెర్రస్‌ పైకి వెళ్లి.. ఆ కుర్రాడు చేసిన పనికి అంతా షాక్..!

ABN , First Publish Date - 2021-11-12T21:56:02+05:30 IST

మనం చెప్పుకోబోయే యువకుడు కూడా క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నాడు. ఓ ఆస్పత్రిలో రోగులంతా నిద్రపోయాక, అర్ధరాత్రి సమయంలో భవనం టెర్రస్ పైకి వెళ్లాడు. తర్వాత అతను చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఆసుపత్రిలో అంతా నిద్రపోయాక అర్ధరాత్రి సమయంలో టెర్రస్‌ పైకి వెళ్లి.. ఆ కుర్రాడు చేసిన పనికి అంతా షాక్..!

నేటి తరం యువకులు చిన్న చిన్న విషయాలకే సీరియస్ నిర్ణయాలు తీసుకుంటుంటారు. ఏం చేస్తున్నారో వారికే తెలియనంత డిప్రెషన్‌లోకి వెళ్లిపోతుంటారు. అంతా జరిగాక.. తాము అలా చేసుండకూడదు అని తెలుసుకుంటారు. కొందరైతే తమ కోపాన్నంతా పక్కవారి మీద చూపిస్తుంటారు. ఈ క్రమంలో చేయరాని ఘోరాలు చేస్తుంటారు. ఇక్కడ మనం చెప్పుకోబోయే యువకుడు కూడా క్షణికావేశంలో నిర్ణయం తీసుకున్నాడు. ఓ ఆస్పత్రిలో రోగులంతా నిద్రపోయాక, అర్ధరాత్రి సమయంలో భవనం టెర్రస్ పైకి వెళ్లాడు. తర్వాత అతను చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..


అది ఛత్తీస్‌గఢ్‌ జాంజ్‌గిర్‌లోని బీడీఎం ఆస్పత్రి.. ఎందరో రోగులు వైద్యం కోసం అక్కడికి వస్తుంటారు. రోగులతో ఆస్పత్రి నిత్యం రద్దీగా ఉంటుంది. గురువారం రాత్రి ఆస్పత్రిలో రోగులంతా నిద్రలోకి జారుకున్నారు. అర్ధరాత్రి సమయంలో టెర్రస్ పైన ఏవో శబ్ధాలు వినిపిస్తున్నాయి. ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాలేదు. ఓ యువకుడు ఆస్పత్రి టెర్రస్‌ పైన పరుగెడుతున్నట్లు.. అక్కడ మేలుకుని ఉన్న కొంతమంది గమనించారు. వెంటనే అతన్ని వెంబడించారు. కానీ వారంతా అతని దగ్గరికి సమీపించే లోపే.. యువకుడు ఆస్పత్రి మూడో అంతస్తు నుంచి ఒక్కసారిగా కిందకు దూకేశాడు. దీంతో అక్కడున్న వారంతా షాక్ అయ్యారు. అయితే ఒకటో అంతస్తుపై పడడంతో తీవ్రగాయాలతో బయటపడ్డాడు.


సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని యువకుడిని ఆస్పత్రిలోకి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యులు ప్రాథమిక చికిత్స అనంతరం వేరే ఆస్పత్రికి రెఫర్ చేశారు. పోలీసుల విచారణలో ఆ యువకుడు.. జంజ్‌గిర్‌లోని సియోని ప్రాంతానికి చెందిన జోసెఫ్‌గా తేలింది. కుటుంబ సమస్యల కారణంగానే ఆత్మహత్యకు యత్నించినట్లు యువకుడు తెలిపాడు. తాను గతంలో జియో ఫైబర్‌ సంస్థలో డ్రైవర్‌గా పని చేసినట్లు వివరించాడు. తర్వాత ఉద్యోగం వదిలేశానని, అప్పటి నుంచి కుటుంబ సమస్యలు ఎక్కువయ్యాయని చెప్పాడు. దీంతో గత్యంతరం లేక ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొన్నాడు. 

Updated Date - 2021-11-12T21:56:02+05:30 IST