అంతా మా ఇష్టం

ABN , First Publish Date - 2021-01-16T06:05:41+05:30 IST

శాంతి భద్రతల కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నామంటూ జిల్లా పోలీసు యంత్రాంగం పేర్కొంటున్న ప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదన్న విమర్శలు వస్తు న్నాయి.

అంతా మా ఇష్టం
వర్నిలో పోలీసు ఠాణాకు సమీపంలో వెలిసిన దాబా

బోధన్‌ డివిజన్‌లో దారితప్పుతున్న శాంతి భద్రతలు
చోద్యం చూస్తున్న ఎక్సైజ్‌, సివిల్‌ పోలీసులు
బోధన్‌, జనవరి 15: శాంతి భద్రతల కోసం పకడ్బందీ చర్యలు చేపడుతున్నామంటూ జిల్లా పోలీసు యంత్రాంగం పేర్కొంటున్న ప్పటికీ ఆచరణలో అమలు కావడం లేదన్న విమర్శలు వస్తు న్నాయి. బోధన్‌ డివిజన్‌లో చోటు చేసుకుంటున్న సంఘటనలే అందుకు నిదర్శనం. డివిజన్‌ పరిధిలోని రుద్రూరు, కోటగిరి, వర్ని, చందూరు, మోస్రా మండలాలు ఉన్నప్పటికీ ఆయా మండలాల పరిధిలో అక్కడక్కడా అవాంఛనీయ సంఘనటలు చోటు చేసుకుం టున్నాయి. విచ్చలవిడిగా మద్యం దాబాలు, బెల్టుషాపులు వెలిసిన ప్పటికీ వీటి నియంత్రణలో అధికార యంత్రాంగం చూసీ చూడన ట్లు వ్యవహరిస్తోంది. మండలాల పరిధిలో నిర్వాహకులు ప్రధాన రహదారులనే అడ్డాలుగా మార్చుకొని దాబాలు ఏర్పాటు చేసి అక్క డే మద్యం సిట్టింగులు నెలకొల్పడంతో మద్యం ప్రియులు తాగిన మైకంలో రోడ్లపై చక్కర్లు కొడుతూ శాంతి భద్రతకు విఘాతం కల్పిస్తున్నారు. ఫలితంగా తరచూ రోడ్డు ప్రమాదాలు జరగడం, పెద్ద మొత్తంలో దొంగతనాలు జరగడం వంటి సమస్యలు చోటు చేసుకోవడంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు. వీటికి తోడు కల్లు దుకాణాలు సైతం రహదారులకు పక్కనే వెలియడంతో కల్లు ప్రియులు సైతం రోడ్లపై తాగి తూగాల్సిన దుస్థితి నెలకొంది. గడిచిన రెండున్నరేళ్లలో ఆయా మండలాల పరిధిలో విలువైన నగదు, నగలు, ఆస్తులను దొంగలు లూఠీ చేయగా పూర్తి స్థాయిలో సొత్తు రికవరి అయిన దాఖలాలు లేవు. గ్రామ కమిటీలు, ప్రజా ప్రతినిధుల అండతో కొనసాగుతున్న ఈ దందాలను అరికట్టడంలో సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు రాగా సివిల్‌ పోలీసులు వాటి నియంత్రణ ఎక్సైజ్‌ శాఖదేనంటు చేతులె త్తేయడంతో అక్రమ వ్యాపారులు అందినకాడికి దోచుకుని రెండు శాఖల పేర్లను అభాసుపాలు చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మద్యం బెల్టుషాపుల నిర్వహణకు అడ్డూ అదుపులేకుండా పోతోంది. ప్రతీ కిరాణషాపు, హోటళ్లలో ఎమ్మార్పీ ధరలపై రూ.20 నుంచి రూ.30 వరకు మద్యం అమ్మకాలపై దోపిడీ జరుగుతోంది. జాకోర, కూనీపూర్‌, చందూరు, లక్ష్మాపూర్‌, ఘన్‌పూర్‌, పాత వర్ని, జలాల్‌పూర్‌ తదితర గ్రామాల్లో పివర్‌ కల్లు పేరిట లీటరుపై రూ.50 చొప్పున విక్రయదారులు దండుకోగా గ్రామాల్లో కల్తీ కల్లు విక్రయాలు కోరలు చాస్తున్నాయి.
మొరం, ఇసుక దందాకు దాదాగిరి
బోధన్‌ డివిజన్‌లో మొరం, ఇసుక దందాల్లోనూ అక్రమ వ్యాపారుల దాదాగిరి రెవెన్యూ అధికారులను నివ్వెర పరుస్తోంది. వర్ని, అక్బర్‌నగర్‌, తగిలేపల్లి, చందూరు, లక్ష్మాపూర్‌, జలాల్‌పూర్‌ తదితర గ్రామాల పరిధిలోని వాగులు అక్రమ మొరం, ఇసుక రవాణాకు అడ్డాగా మారాయి. వీటి నియంత్రణకు చర్యలు తీసుకోవాల్సిన అధికారులు రాజకీయంగానూ, గ్రామ కమిటీల పరంగానూ ఒత్తిళ్లు రావడంతో కేసులు లేకుం డా చేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఫలితంగా రుద్రూరు సర్కిల్‌ పరిధిలో దాదాగిరి చేసి వారికి చట్టాలు చుట్టంగా మారాయన్న విమర్శలు వస్తున్నా యి. ఇకనైనా అధికార యంత్రాంగం ఆయా మండలా ల్లో శాంతి భద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
అసాంఘిక కార్యకలాపాలపై కఠిన చర్యలు తీసుకుంటాం
రామారావు ఏసీపీ, బోధన్‌.
బోధన్‌ డివిజన్‌లో నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న దాబాలు బెల్టుషాపులను నియంత్రించేందుకు కఠిన చర్యలు చేపడతాం. కల్తీకల్లు, అమ్మకాల నేపథ్యంలో ఎక్సైజ్‌ అధికారుల సహాయంతో దాడులు నిర్వహిస్తాం. అడ్డూ అదుపు లేకుండా నిర్వహిస్తున్న బెల్టుషాపుల నిర్వహణకు ప్రోత్సహిస్తున్న వారిపై శాఖాపరమైన చర్యలు చేపడతాం. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ఇలాంటి అసాంఘిక కార్యకలాపాలపై దందాల వల్లే దొంగతనాలు, దోపిడీలు ఇతర అరాచకాలు చోటు చేసుకుంటు న్నట్లు ఫిర్యాదు వచ్చింది. అందుకు బాధ్యులపై చర్యలు చేపడతాం.

Updated Date - 2021-01-16T06:05:41+05:30 IST